
Railway Passenger Alert: సమ్మర్ సీజన్ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా పలు ప్రత్యేక రైళ్లను ఇది వరకే ప్రకటించింది. తాజాగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. కాచిగూడ – కాకినాడ టౌన్, కాచిగూడ – తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు బుధవారం (మే 24న) విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. కాచిగూడ నుంచి తిరుపతికి (రైలు నెం.07061) మే 25 నుంచి ప్రతి గురువారం ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి గురువారంనాడు రాత్రి 10.10 గం.లకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు(శుక్రవారం) ఉదయం 10.30 గం.లకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతి నుంచి కాచిగూడకి (రైలు నెం.07062) మే 26వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 03.00 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 04.00 గం.లకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ షాద్ నగర్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట్, రేణిగుండ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
అలాగే కాచిగూడ నుంచి కాకినాడ టౌన్‌కి (రైలు నెం.07417) ప్రత్యేక వీక్లీ రైలును ఈ నెల 27 తేదీ నుంచి ప్రతి శనివారం నడపనున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు ప్రతి శనివారం రాత్రి 08.45 గం.లకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.45 గం.లకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది. అలాగే కాకినాడ టౌన్ నుంచి కాచిగూడకు (రైలు నెం.07418) ప్రత్యేక వీక్లీ రైలును ఈ నెల 28 తేదీ నుంచి ప్రతి ఆదివారం ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 09.55 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.45 గం.లకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ కాజిపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి.
#Summer #SpecialTrains between various Destinations pic.twitter.com/raoCmn4I8N
— South Central Railway (@SCRailwayIndia) May 24, 2023
ఇదిలా ఉండగా పలు వీక్లీ ప్రత్యేక రైళ్లను జులై నెలాఖరు వరకు పొడగిస్తున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
SCR Extends Weekly Special Train Services during Summer Season
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..