Hyderabad: జనవరి 1న స్కూల్స్‌కు సెలవు ఉందా..? లేదా..? ఇదిగో క్లారిటీ
తెలంగాణలోని పాఠశాలలు మార్చి 2024లో జరగనున్న సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ (SSC) పరీక్షకు సిద్ధమవుతున్నాయి. విద్యాశాఖ శనివారం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, SSC పరీక్షలు మార్చి 18, సోమవారం స్టార్టయి.. ఏప్రిల్ 2 న ముగుస్తాయి. రోజూ ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ సోమవారం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం జనవరి 1వ తేదీని సాధారణ సెలవు దినంగా పేర్కొంటూ సెలవుల జాబితాను విడుదల చేసింది. జనవరిలో, హైదరాబాద్ మరియు ఇతర తెలంగాణ జిల్లాల్లోని పాఠశాలలకు 14, 15, 26 తేదీలలో సెలవులు ఉంటాయి. 14, 15న భోగి, సంక్రాంతి ఉండగా… జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా హాలిడే ఇచ్చారు. జనవరి 16వ కనుమ దృష్ట్యా ఆప్షనల్ హాలిడే ఉంటుంది.
SSC పరీక్షలకు రెడీ అవుతున్నపాఠశాలలు
తెలంగాణలోని పాఠశాలలు మార్చి 2024లో జరగనున్న సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ (SSC) పరీక్షకు సిద్ధమవుతున్నాయి. విద్యాశాఖ శనివారం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, SSC పరీక్షలు మార్చి 18, సోమవారం స్టార్టయి.. ఏప్రిల్ 2 న ముగుస్తాయి. రోజూ ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజీ, 19న సెకండ్ లాంగ్వేజీ, 21న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 26న ఫిజికల్ సైన్స్, 28న బయోలాజికల్ సైన్స్, 30న సోషల్, ఏప్రిల్ 1న ఓఎస్‌ఎస్‌సీ చదివేవారికి సంస్కృతం లేదా అరబిక్ పేపర్-1, ఎస్‌ఎస్‌సీ థియరీ, 2న సంస్కృతం లేదా అరబిక్ పేపర్-2 ఎగ్జామ్స్ ఉంటాయి.
“టైం టేబుల్‌లో పేర్కొన్న ఏదైనా తేదీలో ప్రభుత్వం పబ్లిక్ హాలిడే లేదా సాధారణ సెలవు ప్రకటించినప్పటికీ, మార్చి 2024 SSC పబ్లిక్ పరీక్షలు మాత్రం ఖచ్చితంగా టైంటేబుల్ ప్రకారం నిర్వహించబడుతాయి” అని ప్రెస్ నోట్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఒక్కడ చేయండి..
