AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో బిర్యానీకి భారీగా పెరిగిన ఆర్డర్లు

న్యూఇయర్‌ వేడుకల దృష్ట్యా హైదరాబాద్‌లో బిర్యానీ ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. ఆశించిన స్థాయి కన్నా అధికంగా హోటళ్లకు ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో ఉదయం నుంచి వెరైటీ బిర్యానీల తయారీలో నిమగ్నమయ్యాయి హోటళ్లు. మరి న్యూ ఇయర్ వేడుకలు హైదరాబాద్ బిర్యానీ లేకుండా ఎలా కంప్లీట్ అవుతాయి చెప్పండి..

Hyderabad: హైదరాబాద్‌లో బిర్యానీకి భారీగా పెరిగిన ఆర్డర్లు
Biryani
Noor Mohammed Shaik
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 31, 2023 | 4:40 PM

Share

హైదరాబాద్‌ బిర్యానీ…! ఈ పేరు వింటనే నాన్‌వెజ్‌ ప్రియులు లొట్టలేసుకుని తింటారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ అంటే అంతా ఫేమస్‌ మరి! స్విగ్గీ, జొమాటోలో అత్యధికంగా ఆర్డర్లు హైదరాబాద్‌ బిర్యానీకేనని ఆన్‌లైన్‌ టేస్ట్‌ అట్లాస్‌ నిర్వహించిన సర్వేలోనూ తేలింది. ఇక న్యూఇయర్‌ సందర్భంగా ఎన్నిరకాల వంటలు ఉన్నా…బిర్యానీ ఉందా..? లేదా? అనేదే చూస్తున్నారట. అందుకే ఈవెంట్‌ ఏదైనా హైదరాబాద్‌లో బిర్యానీకి ఫస్ట్‌ ప్రయారిటీ ఇస్తున్నారట నాన్‌వెజ్‌ ప్రియులు. దాంతో ఎక్కడా చూసినా హైదరాబాద్‌లో హోటళ్లు నాన్‌వెజ్‌ వంటకాలతో ఘుమఘుమలాడిపోతున్నాయి. ఆర్డర్లు కూడా వేల సంఖ్యలో వచ్చాయట! కస్టమర్లను సంతృప్తిపరచడమే తమ లక్ష్యమంటున్నారు హోటల్‌ యాజమానులు.

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో బిర్యానీ ఆర్డర్లు భారీగా పెరిగాయి. ఆశించిన దానికన్నా రెట్టింపు సంఖ్యలో ఆర్డర్లు రావడంతో ఇవాళ ఉదయం నుంచే వెరైటీ బిర్యానీల తయారీలో నిమగ్నమయ్యారు హోటళ్లు. బిర్యానీ పాయ, మండి బిర్యానీ, ధమ్‌కా బిర్యానీ, ధమ్‌కా బకరా బిర్యానీ వంటి కమ్మనైనా వంటకాలకు ఆర్డర్లు పెరిగిపోవడంతో యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారట. గతంలో కన్నా ఒక్కసారిగా నాన్‌వెజ్‌ ఆర్డర్లు పెరిగిపోయాయని, ఈ లెక్కన రాత్రి 8 గంటల వరకే బిర్యానీ అయిపోయేలా ఉందని హోటల్‌ నిర్వహకులు చెబుతున్నారు. అయితే కస్టమర్లకు ఇబ్బందులు రాకుండా నాన్‌వెజ్‌ వంటకాలు పూర్తిగా సరఫరా చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఒక్కడ చేయండి..