రాత్రంతా స్టోర్ లోనే బస, తెల్లవారగానే 30 సెల్ ఫోన్లు చోరీ

దొంగలు కొత్తతరహా దోపిడీలకు పాల్పడుతున్నారు. నగరంలో వినూత్న రీతిలో జరిగిన దొంగతనం పోలీసులను సైతం అవాక్కయేలా చేసింది. షేక్ పేట్ లో గల రిలయన్స్ మార్ట్ లో 30 మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు దొంగలు. అది రాత్రివేళ తలుపులు, కిటికీలు పగలగొట్టి చేసిన దొంగతనం కాదు. ఇదో కొత్త తరహా లూటీ. కొనుగోలుదారుడిగా వచ్చిన ఓ వ్యక్తి స్టోర్ లో ఎవ్వరికీ తెలియకుండా దాక్కొని స్టోర్ మూశాక ఈ పని చేశాడు. స్టోర్ లో ఓ మనిషి […]

  • Anil kumar poka
  • Publish Date - 9:07 pm, Mon, 12 August 19
రాత్రంతా స్టోర్ లోనే బస, తెల్లవారగానే 30 సెల్ ఫోన్లు చోరీ

దొంగలు కొత్తతరహా దోపిడీలకు పాల్పడుతున్నారు. నగరంలో వినూత్న రీతిలో జరిగిన దొంగతనం పోలీసులను సైతం అవాక్కయేలా చేసింది. షేక్ పేట్ లో గల రిలయన్స్ మార్ట్ లో 30 మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు దొంగలు. అది రాత్రివేళ తలుపులు, కిటికీలు పగలగొట్టి చేసిన దొంగతనం కాదు. ఇదో కొత్త తరహా లూటీ. కొనుగోలుదారుడిగా వచ్చిన ఓ వ్యక్తి స్టోర్ లో ఎవ్వరికీ తెలియకుండా దాక్కొని స్టోర్ మూశాక ఈ పని చేశాడు. స్టోర్ లో ఓ మనిషి దాక్కుని ఉన్నాడన్న సంగతి గమనించని నిర్వాహకులు ఎప్పటిలాగే రాత్రి 10 గంటల సమయంలో స్టోర్ కు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో రాత్రంతా ఆ దొంగ లోపలే ఉండి 30 మొబైల్స్ ను మూటగట్టుకున్నాడు. మర్నాడు తెల్లవారగానే ఫైయిర్ ఎగ్జిట్ డోర్ నుండి బయటకు వెళ్లిపోయాడు. చోరీ జరిగిందని గమనించిన స్టోర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగిలించిన మొబైల్ ఫోన్ల విలువ దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.