కేసీఆర్‍పై రేవంత్ వ్యాఖ్యలు
మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి మంగళవారం ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ మారడానికి కారణమేంటో సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డిలు కార్యకర్తలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేని పాలనను ఊహించలేమని అన్నారు. తప్పుని తప్పని చెప్పే ప్రతిపక్షాలు లేనప్పుడు ఈ ఎన్నికలు ఎందుకని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అరాచక పాలనకు సమాధి కడతామన్నారు. మల్కాజ్‌గిరిలో తనపై పోటీ చేయడానికి కేసీఆర్‌కు సరైన అభ్యర్థి […]

మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి మంగళవారం ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ మారడానికి కారణమేంటో సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డిలు కార్యకర్తలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేని పాలనను ఊహించలేమని అన్నారు. తప్పుని తప్పని చెప్పే ప్రతిపక్షాలు లేనప్పుడు ఈ ఎన్నికలు ఎందుకని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అరాచక పాలనకు సమాధి కడతామన్నారు. మల్కాజ్‌గిరిలో తనపై పోటీ చేయడానికి కేసీఆర్‌కు సరైన అభ్యర్థి దొరకడంలేదని ఎద్దేవా చేశారు.



