Hyderabad: అస్సలు బయటకు రావొద్దు.. హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌.. నీట మునిగిన పలు ప్రాంతాలు..

| Edited By: Shaik Madar Saheb

Jul 26, 2023 | 6:51 AM

Heavy rainfall alert: హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. ఇవాళ, రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే.. ఎడతెరపి లేని భారీ వర్షాలు హైదరాబాద్‌ను భయపెడుతున్నాయి.

Hyderabad: అస్సలు బయటకు రావొద్దు.. హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌.. నీట మునిగిన పలు ప్రాంతాలు..
Rain Alert
Follow us on

Heavy rainfall alert: హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. ఇవాళ, రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే.. ఎడతెరపి లేని భారీ వర్షాలు హైదరాబాద్‌ను భయపెడుతున్నాయి. మంగళవారం కూడా ఉరుములు మెరుపులతో వర్షం ముంచెత్తింది. గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలన్నీ స్తంభించిపోయాయి. కొద్ది రోజులుగా చిన్న చిన్న బ్రేక్‌లు ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ దంచి కొడుతోంది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీటితో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంత కాలనీల్లోకి కూడా వరద చేరుతోంది. ఇప్పటికే కాలనీల్లో ఉన్న వరద పోలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న వరదతో ఇళ్లు మునిగిపోతాయేమోనన్న భయం ఆయా కాలనీల ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది.

ఇక.. వరద ప్రవాహానికి హుస్సేన్​సాగర్​నిండుకుండలా మారింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్​సాగర్ గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది. దాంతో.. పరిసర ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు.. షేక్‌పేట పరిధిలోని శాతం చెరువు పూర్తిగా నిండిపోవడంతో టోలీచౌకీలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో శాతం చెరువుకు గండి కొట్టి.. నీటిని మూసీలోకి వదిలారు. హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద పెరుగుతూనే ఉంది. దాంతో.. హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మూసీ నది పొంగిపొర్లుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. లాంగర్‌హౌస్‌ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాతావరణశాఖ రెడ్‌ అలెర్ట్‌తో మరో రెండు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయింది. డీఆర్ఎఫ్‌ బృందాలను రెడీ చేసింది. వాటర్‌ లాకింగ్‌ పాయింట్స్‌ దగ్గర సిబ్బందిని కేటాయించింది.

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

ఒకవైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్‌తో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే.. మరో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ఇదే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు ఐటీ క్యారిడార్లో రెండు రోజులపాటు ఆఫీసు వేళలు మార్చుకోవాలని సూచించారు. దానిలో భాగంగా.. ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు ఒకేసారి బయటికి రాకుండా వేర్వేరు లాగౌట్ సమయాలను ప్రకటించారు. ఐకియా నుంచి సైబర్‌టవర్ వరకు ఉన్న కంపెనీలు.. మధ్యాహ్నం 3 గంటలకు, ఐకియా, బయోడైవర్సిటీ, రాయదుర్గం పరిధిలోని.. కంపెనీలు సాయంత్రం నాలుగున్నర గంటలకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలిలోని కంపెనీలు ఈవినింగ్‌ ఆరు గంటలకు లాగౌట్ చేసుకోవాలని ఆదేశించారు మాదాపూర్‌ పోలీసులు. మొత్తంగా.. హైదరాబాద్‌ను మరో రెండు, మూడు రోజులు వరుణుడు వదిలేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటకు వెళ్లాలని టీవీ9 అలర్ట్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..