కిడ్నీ మార్పిడి జ‌రిగిన రోగి వృష‌ణాల్లో డంబెల్ ఆకారంలో అరుదైన క‌ణితి

ఒక యువ‌కుడి వృష‌ణాల్లో అత్యంత అరుదైన‌, పెద్ద డంబెల్ ఆకారంలోని క‌ణితిని హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) వైద్యులు విజ‌య‌వంతంగా తొల‌గించారు. ఇప్పటికే ఈ రోగి కిడ్నీమార్పిడి చేయించుకుని, ఇమ్యునోస‌ప్రెసెంట్ మందులు ఎక్కువ మోతాదులో వాడుతుండ‌టంతో శ‌స్త్రచికిత్స బాగా సంక్లిష్టంగా మారింది. ఏపీలోని క‌డ‌పకు చెందిన 39 ఏళ్ల వ‌య‌సున్న వ్యక్తికి ఏడాది క్రితం..

కిడ్నీ మార్పిడి జ‌రిగిన రోగి వృష‌ణాల్లో డంబెల్ ఆకారంలో అరుదైన క‌ణితి
Ttumour Removed
Follow us
Subhash Goud

|

Updated on: May 28, 2024 | 8:05 PM

ఒక యువ‌కుడి వృష‌ణాల్లో అత్యంత అరుదైన‌, పెద్ద డంబెల్ ఆకారంలోని క‌ణితిని హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) వైద్యులు విజ‌య‌వంతంగా తొల‌గించారు. ఇప్పటికే ఈ రోగి కిడ్నీమార్పిడి చేయించుకుని, ఇమ్యునోస‌ప్రెసెంట్ మందులు ఎక్కువ మోతాదులో వాడుతుండ‌టంతో శ‌స్త్రచికిత్స బాగా సంక్లిష్టంగా మారింది. ఏపీలోని క‌డ‌పకు చెందిన 39 ఏళ్ల వ‌య‌సున్న వ్యక్తికి ఏడాది క్రితం మూత్రపిండాలు పూర్తిగా విఫ‌లం కావ‌డంతో కిడ్నీ మార్పిడి శ‌స్త్రచికిత్స చేశారు. అప్పటినుంచి అత‌డు శ‌క్తిమంత‌మైన స్టెరాయిడ్లు, ఇమ్యునోస‌ప్రెసెంట్లు వాడుతున్నాడు. ఇటీవ‌ల అత‌డికి ఎడ‌మ‌వైపు వృష‌ణం వాపు వ‌చ్చింది. దాన్ని సాధార‌ణ హైడ్రోసిల్ అని నిర్లక్ష్యం చేశాడు. అయితే వాపు క్రమంగా పెరిగిపోతుండ‌టంతో స్థానిక వైద్యుల సూచన మేర‌కు ఏఐఎన్‌యూలో చూపించుకున్నాడు.

అత‌డి ఎడ‌మ వృష‌ణం నుంచి బొడ్డు మీదుగా ఉద‌ర‌భాగం వ‌ర‌కు పెద్ద క‌ణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అత‌డి బీటా హెచ్‌సీజీ స్థాయి అసాధార‌ణంగా పెరిగిపోయింది. ఇది సాధార‌ణ స్థాయి కంటే 20 రెట్లు ఎక్కువ‌గా ఉంది. అదృష్టవ‌శాత్తు ఆ క‌ణితి ల‌క్షణాలు శ‌రీరంలోని ఇత‌ర భాగాలకు వ్యాపించ‌లేద‌ని పెట్ సీటీ స్కాన్‌లో నిర్ధార‌ణ అయ్యింది. ఈ రోగి ఇప్పటికే కిడ్నీ మార్పిడి చేయించుకుని, ఇమ్యునోస‌ప్రెసెంట్ మందులు వాడుతుండ‌టంతో కెమోథెర‌పీ, రేడియేష‌న్ లాంటి సంప్రదాయ చికిత్సలు ఏవీ ప‌నిచేయ‌వు. శ‌స్త్రచికిత్స మాత్రమే చేయాలి. ముందుగా ఎన‌స్థీషియా, శ‌స్త్రచికిత్స కోసం రోగిని సిద్ధం చేసిన త‌ర్వాత‌.. రోగికి జ‌న‌ర‌ల్ ఎన‌స్థీషియాలో ఒక సంక్లిష్టమైన శ‌స్త్రచికిత్స చేశారు.

అత్యంత కీల‌క‌మైన ఆప‌రేష‌న్

క‌న్సల్టెంట్ యూరో-ఆంకాలజిస్టు డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి అడ‌పాల నేతృత్వంలో డాక్టర్ దినేష్ స‌హ‌కారంతో శ‌స్త్రచికిత్స చేశారు. డాక్టర్ నిత్యానంద‌, డాక్టర్ షిఫా నేతృత్వంలో ఎనస్థీషియా బృందం అసాధార‌ణ మ‌ద్దతు ఇ్వవ‌డంతో శ‌స్త్రచికిత్స చాలా సాఫీగా సాగింది. రోగి కోలుకోవ‌డంలో అత్యంత కీల‌క‌మైన ఆప‌రేష‌న్ అనంత‌ర నెఫ్రాల‌జీ సంర‌క్షణ‌ను డాక్టర్‌ శ్రీ‌కాంత్ అందించారు.

కణితి పొడవు 40 సెంటీమీట‌ర్లు:

శ‌స్త్రచికిత్సలో భాగంగా సాధార‌ణం కంటే కాస్త పెద్ద కోత పెట్టారు. ఎడ‌మ‌వైపు తొడ భాగం నుంచి ఉద‌ర భాగానికి ఈ కోత పెట్టారు. త‌ద్వారా లింఫ్‌నోడ్స్ వైపు ముప్పు విస్తరించ‌కుండా జాగ్రత్త ప‌డ్డారు. చుట్టుప‌క్కల ఉన్న మూత్రకోశం, ప్రధాన ర‌క్తనాళాల‌కు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అత్యంత జాగ్రత్తగా, విజ‌య‌వంతంగా క‌ణితిని తొల‌గించారు. దాదాపు 40 సెంటీమీట‌ర్ల పొడ‌వు, డంబెల్ ఆకారంలో ఉన్న ఈ క‌ణితిని వీలైనంత త‌క్కువ ర‌క్తస్రావంతో తొల‌గించ‌డం విశేషం.

రోగిని తొలుత ఐసీయూలోకి త‌ర‌లించి, మూడో రోజు డిశ్చార్జి చేశారు. “వృష‌ణాల్లో క‌ణితులు యువ‌కుల్లో సాధార‌ణ‌మే. కానీ అవి ఇంత పెద్ద ప‌రిమాణంలో పెరిగి ఉద‌ర‌భాగం వ‌ర‌కు వెళ్లడం మాత్రం చాలా అరుదు” అని డాక్టర్ అడ‌పాల తెలిపారు. ఈ రోగికి గ‌తంలో కిడ్నీ మార్పిడి కూడా విజ‌య‌వంతంగా ఏఐఎన్‌యూలోనే జ‌రిగింది. ఇప్పుడు మ‌రో సంక్లిష్ట శ‌స్త్రచికిత్స సైతం ఇక్క‌డే పూర్త‌యింది. త‌మ బృందం సాధించిన ఈ అసాధార‌ణ విజ‌యం ప‌ట్ల ఆస్ప‌త్రి మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సి. మ‌ల్లికార్జున‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ పీసీ రెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పవన్ కల్యాణ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సాయి దుర్గ తేజ్
పవన్ కల్యాణ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సాయి దుర్గ తేజ్
ఈ మురబ్బాలు తినే ఆహారంలో చేర్చుకోండి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టం
ఈ మురబ్బాలు తినే ఆహారంలో చేర్చుకోండి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టం
రైల్వేగేటును ఢీకొట్టి ఆగిన కారు.. అంతలో దూసుకొచ్చిన రైలు..
రైల్వేగేటును ఢీకొట్టి ఆగిన కారు.. అంతలో దూసుకొచ్చిన రైలు..
మిస్టరీ.. ఆ ఊరి బయట నిండుగా కనిపించిన గోనె సంచి.. ఏముందాని చూడగా
మిస్టరీ.. ఆ ఊరి బయట నిండుగా కనిపించిన గోనె సంచి.. ఏముందాని చూడగా
సాయి పల్లవి ఎక్కడ .? చిన్మయి షాకింగ్ పోస్ట్..
సాయి పల్లవి ఎక్కడ .? చిన్మయి షాకింగ్ పోస్ట్..
పాడైపోయిన ఛార్జర్ కేబుల్‌కు ప్లాస్టర్ చుట్టి వాడుతున్నారా?
పాడైపోయిన ఛార్జర్ కేబుల్‌కు ప్లాస్టర్ చుట్టి వాడుతున్నారా?
ఫ్రిడ్జ్‌లో ఈ ఫ్రూట్స్ పెడుతున్నారా.. వీటిని తిన్నా వృథానే!
ఫ్రిడ్జ్‌లో ఈ ఫ్రూట్స్ పెడుతున్నారా.. వీటిని తిన్నా వృథానే!
ఏరా.! మీరు మారరా ఇక.. హోటల్‌లో టిఫిన్‌కొచ్చారనుకుంటే పొరపాటే..
ఏరా.! మీరు మారరా ఇక.. హోటల్‌లో టిఫిన్‌కొచ్చారనుకుంటే పొరపాటే..
రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. అక్టోబర్‌లో కాంతార ఫస్ట్ చాప్టర్‌.!
రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. అక్టోబర్‌లో కాంతార ఫస్ట్ చాప్టర్‌.!
బరువు తగ్గడానికి కీటో డైట్‌ని అనుసరించండి.. ఏ ఆహారం తినాలంటే
బరువు తగ్గడానికి కీటో డైట్‌ని అనుసరించండి.. ఏ ఆహారం తినాలంటే
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో