Free Rapido: హైదరాబాద్‌లో ఉచితంగా ర్యాపిడో సేవలు.. ఎలా ఉపయోగించుకోవాలంటే
ఇందులో భాగంగా ఎన్నికల తేదీ అయిన డిసెంబర్ 30న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను ప్రముఖ బైక్ క్యాబ్ సంస్థ ర్యాపిడో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30వ తేదీన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రటించింది. నగరంలోని ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా అధికారులు సన్నాహాలు చేశారు. ప్రజల్లో ఎన్నికలపై అవగాహన పెంచారు. ఇందులో భాగంగా ఎన్నికల తేదీ అయిన డిసెంబర్ 30న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను ప్రముఖ బైక్ క్యాబ్ సంస్థ ర్యాపిడో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30వ తేదీన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రటించింది. నగరంలోని ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలింగ్ రోజు ఉచిత రైడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
హైదరాబాద్‌లో ఎన్నికల కోసం మొత్తం 2600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు ర్యాపిడో ప్రకటించింది. ఈ అవకాశాన్ని ఓటర్లంతా ఉపయోగించుకోవాలని సంస్థ కోరింది. బస్సు సదుపాయం లేని ప్రాంతాలకు, రూట్ తెలియని వారు ర్యాపిడో సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. అధికంగా పోలింగ్ శాతం నమోదుల కావడమే.. లక్ష్యంగా ఫ్రీ రైడ్ ఆఫర్ చేస్తున్నట్లు ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుండపల్లి తెలిపారు.
ర్యాపిడో కెప్టెన్లంతా డిసెంబర్ 30వ తేదీన ఉదయం నుంచే సిద్ధంగా ఉంటారని, ఓటర్లు కోరిన విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉచితంగా దిగబెడతారని సంస్థ ప్రకటించింది. ఇక ఈ ఉచిత సేవలను ఉపయోగించుకోవాలంటే యాప్ ఓపెన్ చేయగానే ఉచిత రైడ్ సేవల వినియోగానికి సంబంధించిన వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఓటు వేయాల్సిన పోలింగ్ బూత్ ఎక్కడుందో టైప్ చేసిన తర్వాత అప్లై కూపన్ కోడ్ ఉన్న చోట ‘Vote Now’ అనే వన్ టైమ్ కూపన్ కోడ్ నమోదు చేస్తే ఉచిత రైడ్ బుక్ చేసుకోవచ్చు.
పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..
పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..