Rainbow Hospitals: వైద్య రంగంలో మరో సంచలనం.. దేశంలోనే మొట్టమొదటి సారిగా హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ తో అంబులెన్స్ సేవలు
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీలలో నవజాత శిశువులు, చిన్నపిల్లల అత్యవసర రవాణా సేవలను రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభించింది. 250 నుంచి 300 రేడియస్‌లో ఉండే నగరాలు, పట్టణాలకు గత 20 ఏళ్లుగా ఈ సేవలను అందిస్తోంది.
సాధారణంగా నవజాత శిశువులను ఓ హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్‌కు అత్యాధునిక వైద్య చికిత్సలను అందించడం కోసం తరలిస్తుంటారు. ఈ సమయంలో ఈ నవజాత శిశువుల ఆరోగ్యం మరింతగా క్షీణించకుండా చేయడం లేదా అనారోగ్యం బారిన పడకుండా చేసేందుకు అంబులెన్స్‌లో ఐసీయూ వసతులు అవసరమవుతాయి. వీటితో పాటు డాక్టర్లు, నర్సుల సేవలు, వెంటిలేటర్ సహా ఐసీయు పరికరాలు సైతం అంబులెన్స్‌లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీలలో నవజాత శిశువులు, చిన్నపిల్లల అత్యవసర రవాణా సేవలను రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభించింది. 250 నుంచి 300 రేడియస్‌లో ఉండే నగరాలు, పట్టణాలకు గత 20 ఏళ్లుగా ఈ సేవలను అందిస్తోంది. అత్యాధునిక రవాణా వ్యవస్థలో అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దిన అంబులెన్స్, వెంటిలేటర్, ఇంక్యుబేటర్, మానిటర్, సిరెంజ్ పంప్స్, డిఫిబ్రిలేటర్ భాగంగా ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే ‘ ఐసీయు ఆన్ వీల్స్’ లాంటిది ఇది. నవజాత శిశువుల తరలింపులో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సుశిక్షితులైన నర్సులు కూడా అందుబాటులో ఉంటారు. అందువల్ల దగ్గరలోని హాస్పిటల్‌కు (టెరిషియరీ కేర్ హాస్పిటల్) తరలించేంత వరకూ వారికి ఐసీయు చికిత్స అందుతుంది.
15 వేలకు పైగా శిశువులను..
గత రెండు దశాబ్దాల కాలంలో రెయిన్‌బో 15 వేలకు పైగా నవజాత శిశువులు, చిన్నారులను తరలించింది. రాయ్‌పూర్, గోవా, విశాఖపట్నం లాంటి నగరాల నుంచి కూడా నవజాత శిశువులను తరలించింది. అయితే శిశువులు ఆక్సిజన్ సరిగా తీసుకోలేకపోవడం, సాధారణ వెంటిలేటర్‌లో నిర్వహణ లేమి తదితర కారణాలతో కొన్ని సార్లు శిశువుల తరలింపులో సమస్యలు ఏర్పడ్డాయి. ఈ తరహా శిశువులను అధిక ఫ్రీక్వెన్సీతో కూడిన వెంటిలేషన్ కావాల్సి ఉంటుంది. వారు సరిగా ఊపిరి తీసుకునేందుకు నైట్రిక్ ఆక్సైడ్ అవసరం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో హెచ్ఎఫ్ఓవీ వెంటిలేటర్, నైట్రిక్ ఆక్సైడ్ సపోర్ట్ కలిగిన అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో ఈ తరహా సదుపాయాలను కలిగిన మొట్టమొదటి ఆస్పత్రి రెయిన్‌బో హాస్పిటల్సే. ఇటీవల ఓ జిల్లా హాస్పిటల్లో బేబీ మెహ్రీన్ ఫాతిమా ఆరోగ్యవంతంగా 2.7 కేజీల బరువుతో పుట్టింది. కానీ పుట్టిన కొన్ని గంటల తరువాత ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ శిశువుకు గుండెలో సమస్యలు ఉన్నట్లుగా డాక్టర్లు అనుమానించారు. తక్షణమే ఆమెను హైదరాబాద్లోని కార్డియాక్ సెంటర్‌కు తరలించారు. అక్కడ డాక్టర్లు ఆ బేబీ గుండె కుడి భాగం సక్రమంగా పనిచేయడం లేదని గుర్తించారు. దీంతో ఆశిశువు ఆక్సిజన్ స్థాయులు గణనీయంగా పడిపోయాయి. ఆ తరువాత ఆ శిశువుకు అత్యంత తీవ్రమైన స్థితి పెర్శిస్టెంట్ పల్మనరీ హైపర్టెన్షన్ ఆఫ్ ద న్యూబోర్న్ ఉన్నట్లు కనుగొన్నారు. దీనికి తోడు డాక్టర్లు ఆ శిశువు గుండెలో రంధ్రాలు సైతం ఉన్నాయని గుర్తించడంతో శ్వాసతీసుకోవడం కోసం డ్రెయిన్‌ను ఏర్పాటుచేశారు.
ఆ సమస్యలను అధిగమించేందుకు..
శిశువులలో అతి సాధారణ సమస్య పీపీహెచ్ఎన్. ఈ సమస్య కారణంగా నవజాత శిశువులు తీవ్ర అనారోగ్యం బారిన పడతారు. చాలా సార్లు వారు సాధారణ వెంటిలేటర్‌తో కోలుకోరు. వీరికి ప్రత్యేక తరహా వెంటిలేటర్ అయిన హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ (HFOV), నైట్రిక్ ఆక్సైడ్ ను శ్వాసద్వారా అందించాల్సి ఉంటుంది. దీనికి కూడా అత్యాధునిక ఎన్ఐసీయూతో పాటు కార్డియాలజిస్టులు, అనుభవంతో కూడిన నియోనాటల్ సంరక్షణ కావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ శిశువులను ప్రమాదాల బారినుంచి కాపాడవచ్చు. బేబీ మెహ్రీన్ ఫాతిమా పరిస్థితి కూడా అలాంటిదే. పాప ఆరోగ్యం మరింతగా దిగజారడంతో ఆమెకు హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ వెంటిలేషన్ తో పాటుగా నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్ కావాల్సి వచ్చింది. తద్వారా తన శరీరానికి మరింత ఆక్సిజన్ లభిస్తుంది. ఓ సాధారణ వెంటిలేటర్ నిమిషానికి 40–60 బ్రీత్స్ అందిస్తుంది. అదే హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ వెంటిలేటర్ మెషీన్ నిమిషానికి 600–900 బ్రీత్స్ అందిస్తుంది. దురదృష్టవశాత్తు భారతదేశంలోఇలాంటి ఎన్ఐసీయూ వ్యవస్థలు అతి తక్కువగా ఉన్నాయి. ఫాతిమాకు అత్యాధునికమైన లెవల్ 4 ఎన్ఐసీయు కలిగిన బంజారాహిల్స్ రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చికిత్స అందించార. దీనితో పాటుగా 24 గంటలూ నియోనాటాలిజిస్టుల పర్యవేక్షణ అవసరమైంది. అయితే ఇంతకుముందు భారతదేశంలో HFOV ఇన్‌హెల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ సదుపాయాలు కలిగిన అంబులెన్స్‌లు లేవు.గతంలో పీపీహెచ్ఎన్‌తో బాధపడుతున్న శిశువులను అసలు తరలించే వారు కాదు. ఎందుకంటే ఈ తరహా శిశువులు అప్పటికే అనారోగ్యంగా ఉంటారు. అలాంటి వారిని తరలిస్తే ప్రయాణ సమయంలో వారి ఆరోగ్యం మరింతగా క్షీణించే అవకాశాలు ఉంటాయి.
ఈ నేపథ్యంలో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నియోనాటల్ ట్రాన్స్పోర్ట్ బృందం భారతదేశంలో మొట్టమొదటిసారిగా HFOV వెంటిలేటర్త ఇన్హేల్డ్ నైట్రిక్ కలిగిన అంబులెన్స్ సహాయంతో నవజాత శిశువును కాపాడారు. రెయిన్‌బో నియోనాటల్ ఐసీయూకు చేరుకున్న తరువాత HFOV, ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ తో మూడు రోజుల పాటు చికిత్స అందించడంతో అవసరమైన చికిత్స అందించి ఊపిరిపోశారు. అలాగే క్రిటికల్ కేర్ మానిటరింగ్, రెగ్యులర్ కార్డియాక్ ఎస్సెస్మెంట్‌తో 5 రోజుల తర్వాత పాప ఆరోగ్యం మెరుగుపడింది. అత్యద్భుతమైన నియోనాటర్ కేర్, నర్సింగ్ మద్దతు, అత్యాధునిక సదుపాయాలు కలిగిన లెవల్ 4ఎన్ఐసీయు కారణంగా ఈ శిశువు ప్రాణం నిలిచింది. హాస్పిటల్లో చేరిన 8వ రోజు ఆమె కోలుకుంది. ఆమెను 11 వ రోజు తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. గతంలో, భారతదేశంలో ఎన్నడూ కూడా ఈ తరహా క్రిటికల్ కేర్ సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో ఇలాంటి అంబులెన్స్ సేవలు వైద్య రంగంలో మరో విప్లవాత్మక మార్పు అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.