Hyderabad: రాచకొండ సీపీగా సుధీర్ బాబు బాధ్యతలు.. డ్రగ్స్‌ మాఫియా అంతుచూస్తామంటూ వార్నింగ్‌

|

Dec 14, 2023 | 6:33 AM

హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు రాచకొండ కమిషనర్‌. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ...వాళ్ల సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు సీపీ సుధీర్‌ బాబు.

Hyderabad: రాచకొండ సీపీగా సుధీర్ బాబు బాధ్యతలు.. డ్రగ్స్‌ మాఫియా అంతుచూస్తామంటూ వార్నింగ్‌
Rachakonda Cp Sudheer Babu
Follow us on

డ్రగ్స్‌ మాఫియా అంతు చూస్తామంటున్నారు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు. ల్యాండ్‌ గ్రాబర్లు, రౌడీ షీటర్లను ఉక్కుపాదంతో అణిచివేయడం, ట్రాఫిక్‌ సమస్యలు తీర్చడం…తన మెయిన్‌ టార్గెట్లు అంటున్నారు కొత్త సీపీ. తన మీద నమ్మకంతో సీపీగా బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు రాచకొండ కమిషనర్‌. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ…వాళ్ల సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు సీపీ సుధీర్‌ బాబు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ఆయన. నేరాలను అరికట్టడానికి రిటైర్డ్‌ పోలీసు అధికారుల సలహాలు తీసుకుంటామన్నారు ఆయన. పోలీస్ సిబ్బంది వెల్ఫేర్‌పై కూడా దృష్టి సారిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి నూతన టెక్నాలజీని ఉపయోగిస్తామన్నారు.

రౌడీ షీటర్స్‌పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతామన్నారు సుధీర్‌ బాబు. ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసి సైబర్‌ క్రైమ్‌ కేసులను త్వరగతిన పరిష్కరిస్తామన్నారు రాచకొండ సీపీ. అలాగే సిటీలోని మూడు కమిషనరేట్స్ కో ఆర్డినేషన్ తో కలిసి పనిచేస్తామని, ప్రజలకు ఎల్లవేళలా సేవలందిస్తామని అన్నారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తాం.. నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామని సుధీర్ బాబు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సీపీగా బాధ్యతల స్వీకరణ

తెలంగాణ డీజీపీతో సీపీ సుధీర్‌ బాబు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..