Agnipath Protest: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోకి భారీగా చొచ్చుకొచ్చిన ఆందోళనకారులు.. తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నారు. 2వేల మందితో రైల్వే స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన సృష్టించారు. నిన్న రాత్రి దాదాపు 1000 మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల చేరుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే యువకులు వాట్సాప్ గ్రూపుల్లో వారం రోజులుగా రైల్వేస్టేషన్‌ను ముట్టడించేందుకు ముందస్తు ప్లాన్ వేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. దండు మహేష్ అనే వ్యక్తికి వెన్నులో బుల్లెట్ తాకడంతో ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. రాత్రి నుంచే స్టేషన్ లో కపుకాసిన కొందరు విద్యార్థులు ఈ ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.
ఆదివారం నుంచి రైల్వే స్టేషన్ ముట్టడి ప్లాన్
రైల్వే స్టేషన్ block perutho వాట్సాప్ గ్రూప్ నడిపించినట్లు తెలుస్తోంది. 15వతేదీన మధ్యాహ్నం 1.50 గంటలకు ఈ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ పేరుతో మరో గ్రూప్ కూడా క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే 15వ తేదీన ఉదయం 11.12 గంటలకు మరో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయినట్లు గుర్తించారు.
గ్రూప్‌లో ఒక్క రోజులోనే 1000 మంది జాయిన్..
ముందస్తు ప్లాన్ చేసుకున్న యువకులు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకుని ఈ ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 9.30 కల్లా బస్‌లు, టాక్సీలు, ప్రైవేట్ బండ్లు మాట్లాడుకుని మిగతా విద్యార్థులంతా హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. 16వ తేదీన రాత్రి 10 గంటలకల్లా దాదాపు 500 మంది విద్యార్థులు స్టేషన్ లోపల చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి స్టేషన్ లోపలకి చేరుకున్న దాదాపు 100 మంది స్టూడెంట్స్.. స్టేషన్ ముట్టడికి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అగ్నిపథ్ స్కీం ప్రకటన తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా అప్‌డేట్ అయినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి