Hyderabad: క్లౌడ్‌9 రేవ్‌ పార్టీ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు.. పట్టుబడిన వారిలో మెజారిటీ..

ఇందులో భాగంగానే తాజాగా కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. రేవ్ పార్టీలో మొత్తం 20 మంది యువతీ, యువకులు పాల్గొన్నట్లు గుర్తించారు. విదేశీ మద్యంతో పాటు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో దొరికిన వారికి తల్లిదండ్రుల సంక్షేమంలో కౌన్సిలింగ్ ఇచ్చారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు....

Hyderabad: క్లౌడ్‌9 రేవ్‌ పార్టీ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు.. పట్టుబడిన వారిలో మెజారిటీ..
Rave Party
Follow us

|

Updated on: Jul 27, 2024 | 9:20 AM

రేవ్‌ పార్టీలు అంటే ఎక్కడో సిటీ శివారుల్లో ఫామ్‌హౌజ్‌ల్లో జరిగేవి అనుకునే వాళ్లం. కానీ తాజాగా హైదారబాద్‌లో విస్తుపోయే నిజం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా అపార్ట్‌మెంట్‌లోనే రేవ్‌ పార్టీ నిర్వహించారు కొందరు ప్రబుద్ధులు. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ఉన్న క్లౌడ్‌9 అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. రేవ్ పార్టీలో మొత్తం 20 మంది యువతీ, యువకులు పాల్గొన్నట్లు గుర్తించారు. విదేశీ మద్యంతో పాటు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో దొరికిన వారికి తల్లిదండ్రుల సంక్షేమంలో కౌన్సిలింగ్ ఇచ్చారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 10 మందికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. మిగిలిన వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. క్లౌడ్ 9 అపార్ట్‌మెంట్‌లో బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారన్నారు కమలాసన్‌రెడ్డి. రేవ్ పార్టీ కేసులో స్టూడెంట్స్ కూడా ఉన్నారన్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారన్న సమాచారంతో ఆ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టామన్నారు.

ఇదిలా ఉంటే.. 20 మందిలో 14 మంది యువకులు, 6గురు యువతులు పట్టుబడ్డారు. వీరిలో చాలా మంది వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్యలోనే ఉండడం ఆందోళనకరమని డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్ రెడ్డి అన్నారు. వీరిలో అమ్మాయిలు ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోందని ఐజీ చెప్పుకొచ్చారు. కాగా తెలంగాణవ్యాప్తంగా 600కుపైగా ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదయ్యాయన్నారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి. ఇప్పటివరకు 911 మందిని అరెస్ట్‌ చేయడంతో పాటు 3500 కిలోల గంజాయి సీజ్ చేశామన్నారు. తెలంగాణను డ్రగ్‌ ఫ్రీ చేయడమే లక్ష్యమన్నారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి. క్లౌడ్ 9 అపార్ట్‌మెంట్‌ రేవ్‌పార్టీ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారన్న సమాచారంతో ఆ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టారు పోలీసులు. తెలంగాణను డ్రగ్‌ ఫ్రీగా చేయడమే లక్ష్యమన్నారు డ్రగ్‌ కంట్రోల్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్నారా? వర్షాకాలంలో ఈ టిప్స్ మీ కోసం..
ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్నారా? వర్షాకాలంలో ఈ టిప్స్ మీ కోసం..
వయ్యారాల పరువం.. చీరకట్టు అందాలలో మేనకలా తాప్సీ వయ్యారాలు.
వయ్యారాల పరువం.. చీరకట్టు అందాలలో మేనకలా తాప్సీ వయ్యారాలు.
చిన్నవేకదా అని చిన్న చూపు చూడకండి.. పురుషులకు తిరుగులేని వరం..
చిన్నవేకదా అని చిన్న చూపు చూడకండి.. పురుషులకు తిరుగులేని వరం..
పీతపై నరసింహస్వామి ఆకారం.. కోనసీమలో అద్భుతం.! వీడియో..
పీతపై నరసింహస్వామి ఆకారం.. కోనసీమలో అద్భుతం.! వీడియో..
పవన్ కల్యాణ్ 'తొలి ప్రేమ' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
పవన్ కల్యాణ్ 'తొలి ప్రేమ' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!