Hyderabad: మైసూర్ శాండల్ సబ్బులను వదలని కేటుగాళ్లు.. హైదరాబాద్‌లో అడ్డా తెరిచారు..
పప్పు, ఉప్పు, నూనె, ఐస్‌క్రీం, చాక్లెట్ ఇలా అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది. నకిలీ మైసూర్ శాండల్ సబ్బులను తయారు చేసి అక్రమంగా విక్రయిస్తున్న ముఠా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ ముఠాను మలక్‌పేట్ పోలసులు శనివారం అరెస్ట్ చేశారు...
‘గోల్‌మాల్ గోవిందం, మోసం జరగని చోటుందా’.. పాటలోని ఈ చరణాలు ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. కాదేది మోసానికి అనర్హం అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు కేటుగాళ్లు ప్రతీ వస్తువును నకిలీ చేసేస్తున్నారు.
పప్పు, ఉప్పు, నూనె, ఐస్‌క్రీం, చాక్లెట్ ఇలా అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది. నకిలీ మైసూర్ శాండల్ సబ్బులను తయారు చేసి అక్రమంగా విక్రయిస్తున్న ముఠా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ ముఠాను మలక్‌పేట్ పోలసులు శనివారం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించి నకిలీ ఉత్పత్తులతోపాటు దాదాపు రూ. 2 కోట్ల విలువైన తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
విచారణ చేపట్టిన పోలీసులు.. హైదరాబాద్‌కు చెందిన రాకేశ్ జైన్, మహావీర్ జైన్‌లను నిందితులుగా గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. కర్ణాటకు చెందిన మైసూర్ శాండల్ సబ్బులకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సబ్బులపై కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కేఎస్‌డీఎల్ సంస్థకు పేటెంట్ హక్కులు ఉన్నాయన్న విషయం తెలిసిందే.
మైసూర్ శాండల్ పేరుతో మరెవరూ సబ్బులను తయారు చేయొద్దనే నిబంధనకు వ్యతిరేకంగా నకిలీ సబ్బులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మైసూర్ శాండల్ సబ్బులు మార్కెట్‌లోకి వస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి, కేఎస్‌డీఎల్ ఛైర్మన్ ఎం.బి. పాటిల్‌కు సమాచారం అందింది. దీనిపై తెలంగాణ అధికారులకు సమాచారం ఇవ్వడంతోనే తాజాగా దాడులు జరిగినట్లు సమాచారం.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..