చేపమందు పంపిణీపై పిటిషన్?
జూన్ 8వ తేది సాయంత్రం నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని మృగశిర ట్రస్ట్ కార్యదర్శి బత్తిని హరనాథ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమం తొమ్మిదో తేది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ మందును పంపిణీ చేస్తామని.. అస్తమా ఉన్న వారు ఈ మందును స్వీకరించగలరని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ చేపమందు పంపిణీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో లంచ్ […]
జూన్ 8వ తేది సాయంత్రం నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని మృగశిర ట్రస్ట్ కార్యదర్శి బత్తిని హరనాథ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమం తొమ్మిదో తేది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ మందును పంపిణీ చేస్తామని.. అస్తమా ఉన్న వారు ఈ మందును స్వీకరించగలరని ఆయన పిలుపునిచ్చారు.
అయితే ఈ చేపమందు పంపిణీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను బాలల హక్కుల సంఘం దాఖలు చేసింది. ఎలాంటి సైంటిఫిక్ అథారిటీ లేకుండా… చేపమందు ప్రసాదం పంపిణీ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చేపమందు కోసం ప్రభుత్వం అనవసరంగా డబ్బు వృథా చేస్తోందని పిటిషనర్ ఆరోపించారు.