Telangana: కదనరంగంలోకి జనసేనాని.. రేపటి నుంచి ఎన్నికల ప్రచారం షురూ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. బుధవారం నుంచి పవన్ కదనరంగంలోకి దిగనున్నారు. 22, 23 తేదీల్లో పవన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో నిర్వహించే ప్రచార సభల్లో పవన్ పాల్గొంటారు.
హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. బుధవారం నుంచి పవన్ కదనరంగంలోకి దిగనున్నారు. 22, 23 తేదీల్లో పవన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో నిర్వహించే ప్రచార సభల్లో పవన్ పాల్గొంటారు. బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్.. గురువారం నాడు ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట, మధ్యాహ్నం మూడు గంటలకు దుబ్బాకలో ప్రచారం చేస్తారు.
అలాగే ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ తరపున పవన్ కల్యాణ్ క్యాంపెయిన్ చేయబోతున్నారని తెలుస్తోంది. 26న కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని పవన్ కల్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. అంటే.. ఎనిమిది మంది అభ్యర్ధుల్లో ఇద్దరి కోసం ఈనెల 25, 26 తేదీల్లో పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారని సమాచారం అందుతోంది. పవన్ ఎంట్రీతో తమకు మరింత బలం చేకురుతుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు.
ఆ మూడు రోజుల ప్రచారంతో పాటు కేంద్రమంత్రి అమిత్‌షాతో కలిపి వివిధ రోడ్ షోలు, సభల్లో పవన్‌తో ప్రచారం చేయించాలని బీజేపీ కోరుకుంటోంది. మరి మిగతా బీజేపీ అభ్యర్థుల తరపున కూడా పవన్ క్యాంపెయిన్ చేస్తారా, లేదా జనసేనకు చెందిన ఇద్దరు అభ్యర్థులకే పరిమితం అవుతారా అనేది చూడాలి. ఈ ఎన్నికల్లో పవర్ స్టార్ పవర్ పుల్ ఎంట్రీ కోసం తెలంగాణ జనసైనికులంతా వెయిట్ చేస్తున్నారు. కాగా, తెలంగాణ ఎన్నికల్లో జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది.
తెలంగాణలో శ్రీ @PawanKalyan గారు ఎన్నికల ప్రచారం pic.twitter.com/sRgkQRZnn2
— JanaSena Party (@JanaSenaParty) November 21, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..