Pawan Kalyan: చిరంజీవి ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వీడియో చూస్తే మెగా ఫ్యాన్స్‌కు పండగే..

పొలిటికల్‌గా తన పవర్‌ ఏంటో చూపించిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్‌.. కారు మెయిన్‌ గేట్‌లోకి ఎంట్రీ ఇస్తుంటే… అభిమానుల కేరింతలు.. లోపలికెళ్లి కారు దిగగానే... గులాబీలు చల్లుతూ.. ఆనందస్వాగతం పలికారు.. ఇలా.. మెగాస్టార్ చిరంజీవి ఇంట.. సందడి అంబరాన్నంటింది.

Pawan Kalyan: చిరంజీవి ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వీడియో చూస్తే మెగా ఫ్యాన్స్‌కు పండగే..
Pawan Kalyan

Updated on: Jun 06, 2024 | 6:20 PM

పొలిటికల్‌గా తన పవర్‌ ఏంటో చూపించిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్‌.. కారు మెయిన్‌ గేట్‌లోకి ఎంట్రీ ఇస్తుంటే… అభిమానుల కేరింతలు.. లోపలికెళ్లి కారు దిగగానే… గులాబీలు చల్లుతూ.. ఆనందస్వాగతం పలికారు.. ఇలా.. మెగాస్టార్ చిరంజీవి ఇంట.. సందడి అంబరాన్నంటింది. ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారి చిరంజీవి నివాసానికి వెళ్లారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దీంతో చిరుఫ్యామిలీ మొత్తం ఆనందంలో తడిసి ముద్దయింది. కుటుంబసభ్యులంతా సాదరంగా పవన్‌కు స్వాగతం పలికారు. రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్ తేజ్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పవన్‌ను అలింగనం చేసుకుంటూ విషెష్‌తో ముంచెత్తారు.

ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూనే.. తల్లికి, అన్నయ్య చిరంజీవి కాళ్లకు నమస్కరించారు పవన్ దంపతులు. చిరుని అలింగనం చేసుకుని పవన్‌ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక అకిరా నందన్‌ సందడి అందర్నీ ఆకట్టుకుంది. అందర్నీ పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించాడు.

వీడియో చూడండి..

జనసేన అద్భుత విజయం చిరు ఇంట ఆనందాలను నింపింది. అటు చిరు అభిమానులు, జనసేన కార్యకర్తలు చిరంజీవి ఇంటికి చేరుకుని సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.