Hyderabad: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 150 కిలోమీటర్ల వేగంతో కారును ఢీకొట్టిన స్పోర్ట్స్ బైక్.. చివరికి..
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఫనామ సమీపంలో వేగంగా వచ్చిన ఓ బైక్, ఆల్టో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తలకు బలమైన గాయం కావడంతో సందీప్ అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బైక్ డ్రైవ్ చేస్తున్న యాసిన్ అనే యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. క్షత్రగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో యువకుడు నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ స్పీడ్ గంటకు 150 కిలోమీటర్లుగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. ఆల్టో కారులో ఉన్న మరో మహిళకు కూడా గాయాలయ్యాయని తెలిపారు. అతి వేగంగా బైక్ డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్థారించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
