Hyderabad: మందుబాబులకు అలర్ట్‌.. నగరంలో మద్యం దుకాణాలు బంద్. బార్లు, క్లబ్బులు కూడా..

Hyderabad: గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో శనివారం రాత్రి 11 గంటల తర్వాత నుంచి మద్యం దుకాణాలు...

Hyderabad: మందుబాబులకు అలర్ట్‌.. నగరంలో మద్యం దుకాణాలు బంద్. బార్లు, క్లబ్బులు కూడా..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 23, 2022 | 6:58 PM

Hyderabad: గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో శనివారం రాత్రి 11 గంటల తర్వాత నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. బోనాల పండుగ నేపథ్యంలో దుకాణాలు మూసి వేయాలని హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

అయితే హైదరాబాద్‌ ఈస్ట్‌, వెస్ట్‌ జోన్‌లో మాత్రం ఆదివారం ఒక్కరోజు మాత్రమే మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. సౌత్​ జోన్‌లో మాత్రం రెండు రోజుల పాటు వైన్​షాపులను మూసివేయనున్నారు. వైన్స్‌తోపాటు బార్లు, క్లబ్బులను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో సౌత్‌ జోన్‌లో శనివారం రాత్రి మూతపడ్డ మద్యం దుకాణాలు తిరిగి మంగళవారం తెరుచుకోనున్నాయి. ఇదిలా ఉంటే మద్యం దుకాణాలు బంద్‌ కేవలం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు మాత్రమే పరిమితం కానున్నాయని.. రంగారెడ్డి, మేడ్చల్​జిల్లాల్లో దుకాణాలు తెరిచి ఉంటాయని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..