Hyderabad: నేపాలీ గ్యాంగ్‌తో బీకేర్‌ఫుల్.. వ్యాపారి ఇంట్లో వాచ్‌మెన్‌గా చేరిన దంపతులు.. కట్‌ చేస్తే..

Nepalese watchman couple steals gold: హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. నమ్మించి ఇంట్లో వాచ్‌మెన్‌ గా ఉంటూ.. రూ.కోట్ల రూపాయల నగలు, నగదుతో దంపతులు పరారైన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.

Hyderabad: నేపాలీ గ్యాంగ్‌తో బీకేర్‌ఫుల్.. వ్యాపారి ఇంట్లో వాచ్‌మెన్‌గా చేరిన దంపతులు.. కట్‌ చేస్తే..
Robbery

Edited By:

Updated on: Jul 12, 2023 | 12:05 AM

Nepalese watchman couple steals gold: హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. నమ్మించి ఇంట్లో వాచ్‌మెన్‌ గా ఉంటూ.. రూ.కోట్ల రూపాయల నగలు, నగదుతో దంపతులు పరారైన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. సికింద్రాబాద్ సింధు కాలనీలో నివాసం ఉండే రాహుల్ గోయల్ ఇంట్లో.. రూ.5 కోట్ల విలువ అయిన బంగారంతో పాటు కొంత నగదు దొంగతనం చేసి.. నేపల్‌ కు చెందిన దంపతులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్‌ సింధు కాలనీలో నివాసం ఉండే వ్యాపారి రాహుల్ గోయల్ ఫ్యామిలీతో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న నేపాలీ వాచ్మెన్ దంపతులు దొంగతనానికి పాల్పడ్డారు. రూ.ఐదు కోట్ల విలువైన బంగారం, నగదును దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. 4 కిలోల బంగారం, రూ.49 లక్షలు, 10 కిలోల వెండి అపహరణకు గురైనట్లు తెలిపారు.

సింధి కాలనీ డిమ్మి పాన్ షాప్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాహుల్ గోయల్ ఇంట్లో.. ఐదేళ్ల నుంచి నేపాల్ కు చెందిన కమల్ అతని కుటుంబం నివాసం ఉంటుంది. రాహుల్ గోయల్ ఈనెల 9న కుటుంబ సమేతంగా నగర శివారు ప్రాంతంలోని ఫామ్ హౌస్ కి వెళ్లారు. అనంతరం రాహుల్ నిన్న ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నట్లు గుర్తించారు

నేపాల్‌ గ్యాంగ్‌ కోసం వేట..

దొంగతనం చేసిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు.. నిందితులు దేశం దాటి వెళ్లకుండా గాలిస్తున్నారు. గతంలో సైతం నేపాల్ గ్యాంగ్ చోరీలు జరిగాయని.. అలాంటివారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వారితో జాగ్రత్త..

గతంలోనే పోలీసులు నేపాలీ వాచ్మెన్ తో పాటు ఇంట్లో ఉండే పనిమనుషుల పట్ల అలెర్ట్ గా ఉండాలని సూచించినప్పటికీ.. కొంత మంది అవేమీ పట్టించుకోవడం లేదు.. మామూలుగా వాళ్ల సమాచారం తీసుకొని పనిలో పెట్టుకుంటున్నారు. వాచ్ మెన్ తో పాటు పనిమనుషుల వివరాలను సరైన విధంగా తెలుసుకోకుండా పెట్టుకోవడంతో మరోసారి నేపాల్ గ్యాంగ్ తెరపైకి వచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..