AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకరేపుతున్న ‘ఉచిత విద్యుత్’.. రేవంత్ మాటలకు భగ్గుమన్న బీఆర్ఎస్.. ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా మారబోతుందా?

తెలంగాణ రాజకీయాల్లో ఉచిత విద్యుత్‌పై కాకరేగుతోంది. సన్నకారు రైతులకు 3గంటలు ఉచిత విద్యుత్‌ చాలంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు..

కాకరేపుతున్న 'ఉచిత విద్యుత్'.. రేవంత్ మాటలకు భగ్గుమన్న బీఆర్ఎస్.. ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా మారబోతుందా?
Big News Big Debate
Ravi Kiran
|

Updated on: Jul 11, 2023 | 6:46 PM

Share

తెలంగాణ రాజకీయాల్లో ఉచిత విద్యుత్‌పై కాకరేగుతోంది. సన్నకారు రైతులకు 3గంటలు ఉచిత విద్యుత్‌ చాలంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థులకు అస్త్రంగా మారితే.. సొంతపార్టీలోనూ రుసరుసలు మొదలయ్యాయి. రైతులకు ఉచిత విద్యుత్‌ ఎత్తేయడం కాంగ్రెస్ విధానమంటూ బీఆర్ఎస్‌ రోడ్డిపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే.. కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడి కవరింగ్‌ పాలిటిక్స్‌ మొదలుపెట్టింది. అనూహ్యంగా వచ్చిన పవర్‌ ఇష్యూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధానికి తెరతీసింది.

రైతులకు 3 గంటల కరెంట్‌ చాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై BRS భగ్గుమంటోంది. కాంగ్రెస్‌ నిజస్వరూపం బయటపడిందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక విధానం రేవంత్‌ మాటల్లో బయటపడిందన్నారు తెలంగాణ మంత్రులు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అవసరం లేదన్న రేవంత్‌ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని BRS శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేకి అయిన చంద్రబాబు వారసులు ఇంకా తెలంగాణలో ఉన్నారనడానికి రేవంత్‌ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయన్నారు మరో మంత్రి జగదీష్‌రెడ్డి.

ఉచిత విద్యుత్‌పై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోనూ కలకలం రేగింది. అసలు ఉచిత విద్యుత్‌ పథకాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పథకాన్ని కొనసాగిస్తామన్నారు. రేవంత్‌ రెడ్డి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో కనుక్కుంటామన్నారు కోమటిరెడ్డి. అటు రేవంత్‌ వ్యాఖ్యలను కావాలని వక్రీకరిస్తున్నారని మరికొంతమంది పీసీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడారు కాబట్టి కాంగ్రెస్ తప్పించుకునే అవకాశం లేదని బీఆర్ఎస్‌ అంటోంది. ఆయన మాటలను వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ అంటోంది.

కాగా, ఈ అంశానికి సంబంధించి టీవీలో జరిగిన బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వీడియోను ఇక్కడ చూడండి..