Traffic Restrictions: మొహర్రం ఊరేగింపు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Restrictions: మొహర్రం పండగ సందర్భంగా హైదరాబాద్‌ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయం..

Traffic Restrictions: మొహర్రం ఊరేగింపు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Traffic Restrictions

Updated on: Aug 09, 2022 | 5:55 AM

Traffic Restrictions: హైదరాబాద్‌ నగరంలో అప్పుడప్పుడు పలు కారణాల వల్లనో.. ఏదైనా పంగల వల్లనో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తుంటారు అధికారులు. అలాగే ఇప్పుడు మొహర్రం పండగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మొహర్రం పండగ కారణంగా హైదరాబాద్‌ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయం వెల్లడించింది. మంగళవారం బీబీ కా అలవా, దబీర్‌పురా నుంచి మజీద్‌-ఎ ఇలాహి, చాదర్‌ఘాట్‌, వయా మీరాలం నుంచి ఎస్‌జే రోటరీ, శివాజ్‌ వంతెన, దారుల్‌సిఫా, గుల్జార్‌ హౌస్‌, ఎతెబార్‌ చౌక్‌, యాకుత్‌పురా ప్రాంతాల్లో మొహర్రం పండగ సందర్భంగా ఊరేగింపు కారణంగా ప్రయాణికులు అనుమతి ఉండదు. అందుకే ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపింది.

 

ఇవి కూడా చదవండి

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఊరేగింపు ఉన్న ప్రాంతాల్లో బస్సులను కూడా అనుమతించబోమని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఊరేగింపు సందర్భంగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి