AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రన్నింగ్‌లో ఉండగా స్కూటీలో కనిపించిన పాము.. వాహనదారుడు ఏం చేశాడో తెలిస్తే…

హైదరాబాద్‌లో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. యాక్టివా ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న ఓ వాహనదారుడికి ఓ వింత అనుభవం ఎదురైంది. అతను రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో స్కూటీలోంచి బయటకు వచ్చిన ఒక నాగుపాము అతని చేతిపైకి ఎక్కంది. అది చూసి భయపడిపోయిన వ్యక్తి వెంటనే పామును కింద పడేసి స్కూటీని వదిలి దూరంగా పారిపోయాడు.

Watch Video: రన్నింగ్‌లో ఉండగా స్కూటీలో కనిపించిన పాము.. వాహనదారుడు ఏం చేశాడో తెలిస్తే...
Snake On Bike
Noor Mohammed Shaik
| Edited By: Anand T|

Updated on: Jul 22, 2025 | 7:47 AM

Share

వర్షాకాలంలో పాములు తరచూ ఇంటి పరిసరాల్లోకి వస్తుంటాయి. ఇలా వచ్చిన పాములు కొన్ని సందర్భాల్లో మనం బయటపెట్టే షూలలో కూడా దూరుతూ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఒక పాములు ఇంటి పరిసరాల్లో నిలిపిన స్కూటీలోకి దూరింది. ఆగ మనించని వాహనదారుడు దాన్ని తీసుకొని అలానే వెళ్లి పోయాడు. మార్గం మధ్యలో స్కూలోంచి పాము బయటకు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే వాహనాన్ని పక్కకు ఆపి దూరంగా పరిగెత్తాడు. ఈ వింత ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. అంబర్పేట పటేల్ నగర్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తి ఉదయం సమయంలో ఆజాద్ నగర్ మీదుగా అలీ కేఫ్ చౌరస్తా వైపు వెళ్తున్నాడు. ఆజాద్ నగర్ మదర్సా వద్దకు రాగానే అతని ద్విచక్ర వాహనంలో అంతవరకు ఉన్న నాగుపాము పిల్ల అకస్మాత్తుగా అతని చేతి మీదికి ఎక్కింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన అతనకు వెంటనే తన చేతిపై ఉన్న నాగుపామును విసిరి కొట్టగా అది కింద పడింది. దీంతో ఆందోళనకు గురైన వాహనదారుడు వెంటనే వాహనాన్ని పక్కకు ఆపి దానిపై నుంచి కిందికి దిగాడు.

అయితే క్రింద పడిపోయిన నాగుపాము మళ్లీ అతని స్కూటీలోకి దూరింది. దాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు రెండు గంటలపాటు వాహన భాగాలన్నింటిని విప్పగా పాము లోపల దూరి ఉండడం గమనించి బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నడిపేటప్పుడు తమ వాహనాలలో ఏమైనా పాములు తదితర జంతువులు ఉన్నాయా చూసుకోవాలని స్నేక్ క్యాచర్ సూచించాడు. అయితే వాహనదారుడిని పాము కాటువేయకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

వీడియో చూడండి..

మరిన్ని  ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.