Hyderabad: జంట నగరాల్లో అడుగంటిన భూగర్భజలాలు..! ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడికి పోతుందో…
హైదరాబాద్ నగరంలో కాలనీలకు కాలనీలే మునిగిపోతున్న చుక్క వర్షం నీటి బొట్టు కూడా భూగర్భంలోకి ఇంకడం లేదు! హైదరాబాద్ మహానగరం కాంక్రీట్ జంగిల్గా మారిపోవడంతో భూగర్భ జలాలు ప్రమాదగంటికలు మోగిస్తున్నాయా అంటే... తెలంగాణ భూగర్భ జల శాఖ అవుననే అంటుంది. ఇంతకీ హైదరాబాద్ మహానగరానికి ఏమైంది!

హైదరాబాద్, జులై 21: ఇది మన హైదరాబాద్ మహానగరం.. అభివృద్ధిలో సూపర్ ఫాస్ట్ తో దూసుకుపోతుందని అంతా మనమెంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ పైన ఆర్భాటం.. భూగర్భంలో జలగండం.. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. భూగర్భ జలాలు హైదరాబాద్ మహానగరంలో ప్రమాద స్థాయిలో అడుగంటి పోతుండడంతో హైదరాబాద్ రెడ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ నగర జనాభా తో పాటు ఎక్కడికి అక్కడ కాంక్రీట్ భవంతులు… దానికి తోడు ఒక్క అడుగు గ్యాప్ లేనంతగా ఇండ్ల మధ్య ట్రాఫిక్ లో విస్తరించిన కాంక్రీట్ రోడ్లు.. వర్షపు నీరు భూమిలోకి ఇంకెందుకు గజం జాగా కూడా లేనంతగా మారిన ప్రమాదకర పరిణామాల ఫలితంతో భూగర్భంలో జలాలు అడుగంటి పోయాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక హైదరాబాద్ మహానగరంలోనే పరిస్థితిలు అత్యంత దారుణంగా తయారయ్యాయి.
గత ఏడాది భూగర్భ జలాలు ప్రమాదా స్థాయిలో అడుగంటి పోయాయి అనుకుంటే ఈ ఏడాది మరింత దారుణంగా భూగర్భ జలాలు డేంజర్ లెవెల్స్ మోగిస్తున్నాయి. గత ఏడాది జూన్ మాసంలో హైదరాబాద్ నగరంలో యావరేజ్ గా 8.56 మీటర్ల లెవెల్స్ లో భూగర్భ జలాలు ఉంటే… అది ఇప్పుడు 9.96 మీటర్లకు పడిపోయింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు మైనస్ 1.40 తేడా గమనించొచ్చు. అలాగే సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే గత ఏడాది జూన్లో 12.94 మీటర్స్ లెవెల్ లో భూగర్భ జలాలు ఉంటే ఈఏడాది జూన్‌కి 12.98 మీటర్లకు పడిపోయింది. అలాగే మేడ్చల్ జిల్లాలో చూసుకుంటే గత ఏడాది జూన్లో 12.89 మీటర్లకు బుగర్భ జలాలు ఉంటే అది ఏడాది జూన్ కి 14.22 మీటర్లకు కు భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.
ఈ కారణంగా గతంలో ఎన్నడు లేనివిధంగా హైదరాబాద్ చరిత్రలోనే వర్షాకాలంలో సమ్మర్ సీజన్ ఎఫెక్ట్ను నగరవాసులు చూస్తున్నారు. భూగర్భ జలాలు అడిగింటి పోయి బోర్లు పనిచేయకపోవడంతో సమ్మర్లో ప్రతిరోజు 11వేలా ట్యాంకర్లను జలమండలి నుంచి నగరవాసులు డ్రా చేసుకునేవారు. ఇప్పుడు 8000 నుంచి 9000 వరకు జలమండలి వాటర్ ట్యాంకుల మీద ప్రతిరోజు నగరవాసులు ఆధార పడాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో దారుణ పరిస్థితులు ఎదుర్కోక తప్పదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




