AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కేసీఆర్ తర్వాత ఆయనే ముఖ్యమంత్రి.. అన్ని అర్హతలు ఆయనకే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్స్..

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. రోజు రోజుకు మారిపోతున్న పరిస్థితులతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గెలుపు కోసం అధికార, విపక్షాల నేతలు..

Telangana: కేసీఆర్ తర్వాత ఆయనే ముఖ్యమంత్రి.. అన్ని అర్హతలు ఆయనకే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్స్..
Srinivas Goud
Ganesh Mudavath
|

Updated on: Oct 19, 2022 | 12:41 PM

Share

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. రోజు రోజుకు మారిపోతున్న పరిస్థితులతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గెలుపు కోసం అధికార, విపక్షాల నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతోంది. తాజాగా బీజేపీపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకోని బీజేపీ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. తెలంగాణను ఆగం చేసేందుకు బీజేపీ కుట్రలు, కుత్రంతాలు చేస్తోందని ఆక్షేపించారు. మునుగోడు ఎన్నికను చూపి తెలంగాణను బీజేపీ ఎం చేయదలుచుకుందని మంత్రి శీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కారును పోలిన గుర్తులు, మనిషి పేరు వచ్చే విధంగా నామినేషన్ వేయించింది బీజేపీ నే అని మంత్రి వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలు బీజేపీని అసహించుకున్నా.. డబ్బు అహంకారంతో ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు.

దుబ్బాక, హుజురాబాద్ లో కేంద్రం, బీజేపీ నాయకులు ఎన్ని నిధులు తెచ్చారు?. అక్కడ చెప్పిన రొటీన్ డైలాగ్స్ మునుగొడులో చెప్తున్నారు. మతం పేరుతో దేశంలో కేంద్రంలో ఉన్న బీజేపీ చిచ్చుపెడుతోంది. ఎన్నికలు రాగానే బీజేపీకి గుర్తుకు వచ్చేది హిందుత్వం. హిందుత్వానికి పేటెంట్ తీసుకున్నట్లుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ధర్మం ముందు…బీజేపీ అధర్మం గెలవదు. కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రధాని మోడీయే స్వయంగా తయారు చేసినట్లు బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. నోబెల్ బహుమతికు ప్రధాని పేరు సిఫారసు చేస్తే బాగుంటుంది. తెలంగాణ మాదిరి పరిపాలన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమైనా జరుగుతుందా?. 80 కోట్ల వృత్తి కులాలు ఉన్న ఈ దేశంలో దేశ రాజధానిలో ఒక్క భవనం ఏమైనా ఉందా?. తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు భవనాలు ఉన్నట్లు…ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి?. మునుగోడు గెలిస్తే వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్పుకోవడానికి బీజేపీ అన్ని రకాల కుట్రలు చేస్తోంది.

      – శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఉప ఎన్నిక ఎందుకు తెచ్చారో ప్రజలు ఆలోచన చేయాలని మునుగోడు ప్రజలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీకి జోడో యాత్ర ముఖ్యమా? మునుగోడు ఉప ఎన్నిక ముఖ్యమా? అని నిలదీశారు. కేసీఆర్ తరువాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి సంచలన కామెంట్స చేశారు. ఎప్పటికైనా కేసీఆర్ తరువాత ఆయనే ముఖ్యమంత్రి అని కుండబద్ధలు కొట్టారు. సీఎం కేసీఆర్ కుమారుడిగా కాకుండా అన్ని రకాల అర్హత కలిగిన కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Follow Us