Bandi Sanjay: ‘ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను..’ బండి సంజయ్‌పై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్..
అమిత్ షా తెలంగాణ పర్యటనలో బండి సంజయ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణలో రాజకీయ హీట్ పెంచాయి. అధికార టీఆర్ఎస్ పార్టీతో సహా.. కాంగ్రెస్, బీజేపీలు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో సుడిగాలి పర్యటన చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఆయన మునుగోడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందంటూ గులాబీ పార్టీ నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ పార్టీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.
ఈ తరుణంలో అమిత్ షా తెలంగాణ పర్యటనలో బండి సంజయ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ వీడియోపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవం గుజరాత్ నేతల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారంటూ టీఆర్‌ఎస్,కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా? అంటూ టీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. నిన్న ఉజ్జయిని ఆలయం నుంచి అమిత్ షా బయటకు వచ్చిన తర్వాత బండిసంజయ్ చెప్పులు అందిస్తున్న వీడియోను టీఆర్‌ఎస్ నేత క్రిషాంక్ పోస్టు చేశారు. ఈ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ రిట్వీట్ చేశారు. ‘ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నింపడానికి తెలంగాణ సబ్బండ వర్గం సిద్ధంగా’ ఉందని ట్వీట్ చేశారు.
ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది.
జై తెలంగాణ! https://t.co/SpFCHAszYe
— KTR (@KTRTRS) August 22, 2022
బానిస రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. అమిత్‌షా చెప్పులను బండి సంజయ్ మోశారని అన్నారు. ఈ చర్యతో తెలంగాణ సమాజాన్ని అమిత్ షా కించపరిచరాని మండిపడ్డారు. మోదీ, అమిత్ షా కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.
Telangana BJP state president Sanjay Bandi takes shoes of Amit shah …
“Telugu Vari Atma Gauravam” ?????????
What’s the position of Backward class leader in BJP see the truth .. pic.twitter.com/buk99T4Jlg
— Manickam Tagore .B??✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 22, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..