TS ICET Results 2022: నేడు విడుదలకానున్న తెలంగాణ ఐసెట్ 2022 ఫలితాలు..రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
తెలంగాణ ఐసెట్ 2022 ఫలితాలు ఈ రోజు విడుదలకానున్నాయి. ఈ మేరకు ఆగస్టు 22 (సోమవారం) ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TSCHE) ప్రకటించింది. ఫలితాల ప్రకటన అనంతరం..
TS ICET Result 2022 Date: తెలంగాణ ఐసెట్ 2022 ఫలితాలు ఈ రోజు విడుదలకానున్నాయి. ఈ మేరకు ఆగస్టు 22 (సోమవారం) ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TSCHE) ప్రకటించింది. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధుల పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐసెట్ 2022 పరీక్ష జులై 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ కీ ఆగస్టు 4న విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై సవాళ్లు లేవనెత్తడానికి కూడా అవకాశం కల్పించింది. ఈ రోజు ఐసెట్ ఫలితాలతోపాటు తుది ఆన్సర్ కీని కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
కాగా 2022-23వ విద్యా సంవత్సరానికిగానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఐసెట్-2022ను నిర్వహించింది. ఐసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.