Telangana: తెలంగాణకు పెట్టుబడుల పరంపర.. రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ‘లులూ’ గ్రూప్ ఒప్పందం..

Minister KTR - Lulu company: తెలంగాణలో విదేశీ పెట్టుబడుల పరంపర కొనసాగుతుంది. తెలంగాణలో దశలవారిగా 3వేల 5వందల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థ లులూ గ్రూప్ ముందుకు వచ్చింది.

Telangana: తెలంగాణకు పెట్టుబడుల పరంపర.. రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ‘లులూ’ గ్రూప్ ఒప్పందం..
Lulu Ktr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 26, 2023 | 12:45 PM

Minister KTR – Lulu company: తెలంగాణలో విదేశీ పెట్టుబడుల పరంపర కొనసాగుతుంది. తెలంగాణలో దశలవారిగా 3వేల 5వందల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థ లులూ గ్రూప్ ముందుకు వచ్చింది. బేగంపేటలోని ఐటిసి కాకతీయ హోటల్లో మంత్రి కేటీఆర్, లులూ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫూడ్ ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్ అండ్ రిటైల్ రంగంలో తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు కేటీఆర్ తో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం, లులూ మ‌ధ్య కుదిరిన ఒప్పందం తర్వాత.. రాబోయే రోజుల్లో తాము చేపట్టనున్న కార్యకలాపాల గురించి లూలు సంస్థ అధికారికంగా ప్రకటించింది. కాగా, గత దావోస్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో లులూ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదు‌ర్చుకుంది. లులూ సంస్థ హైప‌ర్ మార్కెట్లు, మ‌ల్టీ ప్లెక్స్‌ల నిర్మాణంలో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీగా పేరుగాంచింది. అబూదాబి కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.

లూలూ ప్రతినిధులతో భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి సంస్థ హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాల్లోనూ దేశంలో ముందుందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలతోపాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని.. త్రివేండ్ రెవల్యూషన్ వై ట్రివల్యూషన్ థింక్ రెవల్యూషన్ ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందుందన్నారు. రాష్ట్రంలో లూలూ సంస్థ పెట్టబడులతో తెలంగాణ టూరిజం పెరుగుతుందని భావిస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ మాట్లాడుతూ.. 3500 కోట్ల పెట్టుబడితో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇప్పటికే 300 కోట్ల పెట్టుబడితో లులు షాపింగ్ మాల్ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ నగరంలో లులూ మాల్ ప్రారంభించబోతున్నామన్నారు. ఇప్పటికే లులూ మాల్ కు సంబంధించి 80% పని పూర్తి అయినట్లు తెలిపారు. దావోస్ లో అందుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నామని వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..