TS Eamcet 2023 Counselling: తొలిదశ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం.. విద్యార్ధుల్లో తొలగని గందరగోళం
తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశాల కౌన్సెలింగ్ సోమవారం (జూన్ 26) నుంచి ప్రారంభం కానుంది. జూన్ 26 నుంచి జులై 5 వరకు విద్యార్ధులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ డా బీ డీన్ కుమార్..
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశాల కౌన్సెలింగ్ సోమవారం (జూన్ 26) నుంచి ప్రారంభమైంది. జూన్ 26 నుంచి జులై 5 వరకు విద్యార్ధులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ డా బీ డీన్ కుమార్ సూచించారు. అనంతరం జూన్ 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని ఆయన తెలిపారు. జూన్ 28 నుంచి జులై 8 వరకు కాలేజీల్లో సీట్ల ఎంపికకు ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచామని కన్వీనర్ తెలిపారు.
మరోవైపు ఇప్పటివరకూ కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీలు, ఉండే సీట్ల వివరాలు మాత్రం ఎంసెట్ కౌన్సెలింగ్ విభాగానికి అందలేదు. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 145 కాలేజీలు ఉండగా.. వాటిల్లో 1.05 లక్షల ఇంజనీరింగ్ ఉన్నాయి. వీటికి సంబంధించిన జాబితాను గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు పంపాల్సి ఉంటుంది. కాలేజీలు, సీట్ల వివరాలు పొందుపర్చకపోతే ఆప్షన్లు ఇవ్వడం ఎలా సాధ్యమని అధికారులే అంటున్నారు. ఈ ఏడాది ఎంసెట్‌కు 1,95,275 మంది హాజరుకాగా వారిలో 1,56,879 మంది అర్హత సాధించారు. వీరంతా కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.