Telangana Elections: మిడ్ నైట్ సమావేశాలు.. స్పెషల్ స్ట్రాటజీతో పాతబస్తీ జనంలోకి.. హైదరాబాద్ పాతబస్తీలో MIM ఎన్నికల ప్రచారం..
తెలంగాణ ఎన్నికల వేళ ఓటర్లపై రాజకీయ పార్టీలు వరాలు జల్లులు కురిపిస్తామని హామీలు ఇస్తున్నాయి. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే మహిళలకు, సామాజికవర్గాల వారీగా పెద్ద పీట వేస్తామని ఓటర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికతోపాటు మేనిఫెస్టోలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. మరోవైపు.. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఎంఐఎం కూడా ప్రత్యేక స్ట్రాటజీతో..

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ ఎన్నికల వేళ ఓటర్లపై రాజకీయ పార్టీలు వరాలు జల్లులు కురిపిస్తామని హామీలు ఇస్తున్నాయి. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే మహిళలకు, సామాజికవర్గాల వారీగా పెద్ద పీట వేస్తామని ఓటర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికతోపాటు మేనిఫెస్టోలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి.
మరోవైపు.. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఎంఐఎం కూడా ప్రత్యేక స్ట్రాటజీతో హైదరాబాద్ పాతబస్తీలోని ప్రజల్లోకి వెళ్తోంది. పగలు కార్యకర్తలు వాళ్లవాళ్ల పనుల్లో ఉండటంతో సాయంత్రం, నైట్ వేళల్లో టైమ్ దొరికినప్పుడు ప్రజలతో ఎంఐఎం సమావేశాలు నిర్వహిస్తోంది.
మజ్లీస్ నాయకులు తనదైన శైలిలో ప్రచారం నిర్వహించుకుంటూ మిడ్ నైట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. అయితే.. మజ్లీస్ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలు బలంగా లేకపోవడంతో ఎంఐఎం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదన్నది ప్రతీ ఎన్నికల్లో నిరూపితం అవుతూనే ఉంది.
కానీ.. ఈ సారి చాలా పార్టీల్లోనూ ఎంఐఎంకు సంబంధించిన వ్యక్తులకే టికెట్ రావడంతో.. వాళ్ళు ఆ పార్టీకే ప్రచారం చేస్తారా.. లేక.. ఎంఐఎం పార్టీకి ప్రచారం చేయిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పాతబస్తీ లాంటి ఏరియాల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా.. పాతబస్తీ గల్లీల్లో ప్రచారం చేసే సాహసం ఇతర పార్టీ నాయకులు చేయరనేది నిజం.
ప్రచారానికి వెళ్లిన ప్రతీసారీ స్థానికులు అడ్డుకోవడం.. ఇక్కడికెందుకు వచ్చారంటూ ప్రశ్నించడం సహజం.. ఐదేళ్ల నుంచి తమ కష్టాలను పట్టించుకోలేదు గాని.. ఇప్పుడు ఎందుకు వస్తున్నారని నిలదీస్తారు. ఇతర పార్టీ నాయకులకు గల్లీలో మీటింగ్‌లు, బహిరంగ సభలు పెట్టే అవకాశం కూడా ఉండదు. దాంతో.. ఎంఐఎం అభ్యర్థుల గెలుపు సునాయాసం అవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
