AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రాణం తీసిన సరదా.. గండిపేటలో MGIT ఇంజనీరింగ్ విద్యార్ధి దుర్మరణం!

కారులో కాలేజీ నుంచి ఇంటికి బయల్దేరిన ఇంజనీరింగ్‌ విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తోటి విద్యార్ధులతో కలిసి రోడ్డుపై వేగంగా కారు నడిపి నిండు ప్రాణాన్ని బలిచ్చాడు. ప్రమాదంలో కారులోని మరో ఐదుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకివెళ్తే..

Hyderabad: ప్రాణం తీసిన సరదా.. గండిపేటలో MGIT ఇంజనీరింగ్ విద్యార్ధి దుర్మరణం!
MGIT Engineering College student
Srilakshmi C
|

Updated on: Mar 11, 2025 | 6:09 PM

Share

గండిపేట, మార్చి 11: సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తోటి స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న ఇంజనీరింగ్‌ విద్యార్ధి అతివేగం కారణంగా దుర్మరణం చెందాడు. వాహనాన్ని వేగంగా నడపడంతో అది అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకివెళ్తే..

హైదరాబాద్‌ నగరంలోని గండిపేటలోని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మంగళవారం సాయంత్రం TS08BEG4929 నెంబర్ గల స్విఫ్ట్ కార్‌లో కళాశాల నుంచి ఇంటికి బయల్దేరారు. అయితే నియో పోలీస్ సమీపంలోని రాజపుష్ప కన్‌స్ట్రక్షన్ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి.. వేగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీకర్ (18) అనే విద్యార్ధి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అదే వాహనంలోని హేమ సాయి (19), వివేక్ (19), సృజన (18), కార్తికేయ (18), హర్ష (19) అనే ఐదురుగు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో హర్ష సాయి పరిస్థితి విషమంగా ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే నిండు ప్రాణాన్ని బలిగొన్నందని, ఎన్నిసార్లు హెచ్చరించినా యువత వేగంగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనీ నార్సింగి పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అధ్యాపకులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స‌హ‌క‌రించాల‌ని పోలీసులు కోరారు. కాగా తాజా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
గ్రైండర్ వల్ల ఆ పిల్లాడి ప్రాణం పోయింది.. అసలేం జరిగిందంటే..
గ్రైండర్ వల్ల ఆ పిల్లాడి ప్రాణం పోయింది.. అసలేం జరిగిందంటే..
అనకాపల్లి అగ్నిప్రమాదం: గూడ్స్ రోడ్డులో మహిళా సజీవ దహనం
అనకాపల్లి అగ్నిప్రమాదం: గూడ్స్ రోడ్డులో మహిళా సజీవ దహనం
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిల్‌ గేట్స్: ఉండవల్లిలో అరటి తోటల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిల్‌ గేట్స్: ఉండవల్లిలో అరటి తోటల పరిశీలన
రంగారెడ్డి రోడ్డు ప్రమాదం: హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
రంగారెడ్డి రోడ్డు ప్రమాదం: హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
చూపుడు వేలు పొడవు.. మీ గురించి ఏమి చెబుతుందో తెలుసా?
చూపుడు వేలు పొడవు.. మీ గురించి ఏమి చెబుతుందో తెలుసా?
క్యూట్ క్యూట్ ఫొటోలతో మతిపోగొడుతున్న కృతి శెట్టి..
క్యూట్ క్యూట్ ఫొటోలతో మతిపోగొడుతున్న కృతి శెట్టి..
రేపే సూర్య గ్రహణం.. సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసుకోండి!
రేపే సూర్య గ్రహణం.. సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసుకోండి!
సూర్య గ్రహణం ఎఫెక్ట్ .. ఈ రాశుల వారికి అడుగడుగునా సమస్యలే!
సూర్య గ్రహణం ఎఫెక్ట్ .. ఈ రాశుల వారికి అడుగడుగునా సమస్యలే!
8 ఏళ్లుగా సినిమాలకు దూరం.. ఈ హీరోయిన్ ఆస్తి రూ. 700 కోట్లకు పైనే
8 ఏళ్లుగా సినిమాలకు దూరం.. ఈ హీరోయిన్ ఆస్తి రూ. 700 కోట్లకు పైనే
మీ ఫ్రిజ్ నుంచి శబ్దం వస్తోందా.. ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు..
మీ ఫ్రిజ్ నుంచి శబ్దం వస్తోందా.. ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు..