ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో ఓ ప్రైవేటు స్కూలు భవనం నిర్మాణంలో ఉండగా స్లాబ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను జంగారెడ్డిగూడెం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.