కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం తిమ్మాపురం చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు భారీస్థాయిలో జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో పగలు రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. 75 ఎకరాల చెరువులో 10 ఎకరాలనుంచి మట్టి తవ్వుతున్నారని సమాచారం.