Fancy number: మణికొండ RTA ఆఫీస్‌లో ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ వేలం..ఆ నెంబర్ ఎవరు కొన్నారంటే!
ప్రస్తుత రోజుల్లో ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది.ఫ్యాన్సీ నెంబర్ల కోసం వ్యాపార వేత్తలు లక్షలు ఖర్చు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి కూడా బాగానే ఆదాయం వస్తుంది. హైదరాబాద్‌లోని మణికొండ ఆర్టీవో ఆఫీస్‌లో నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ వేలంతో ఆర్టీఏకి రూ.52.6లక్షల ఆదాయం వచ్చింది.

ప్రస్తుత రోజుల్లో ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. కొందరు దనవంతులు, బాగా పేరొందిన వ్యాపార వేత్తలు తాము అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. తమకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో వారు కొనుగోలు చేసిన వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్స్ వెయించుకుంటారు. ఆ ఫ్యాన్సీ నెంబర్స్ కోసం ఎంత డబ్బైన ఖర్చు పెడతారు. అయితే ఈ ఫ్యాన్సీ నెంబర్ల నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడా వస్తుంది. హైదరాబాద్‌లోని మణికొండ ఆర్టీఏ అధికారులు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్స్ ప్లేట్స్ వేలంతో ఆర్టీఏకు రూ.52.6లక్షల ఆదాయం చేకూరింది.
హైదరాబాద్‌లోని మణికొండ ఆర్టీఏ ఆఫీసులో ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ వేలం పాట జరిగింది. ఈ వేలంలో ఫ్యాన్సీనంబర్ TG 07 R 9999′ నంబర్ ఏకంగా 12,49,999 లక్షలు పలికింది. కాంగ్రూయెంట్ డెవలపర్స్ అనే ప్రముఖ రియల్‌ఎస్టేస్ సంస్థ రూ.12,49,999 ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను సొంతం చేసుకుంది. అలాగే రూ.8.5లక్షలకు ‘TG 07 AA 0009’ అనే ఫ్యాన్సీ నెంబర్‌ను రుద్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సొంతం చేసుకోగా.. రూ. 4.77 లక్షలకు ‘TG 07 AA 0001′ నెంబర్‌ను ఫుజి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సొంతం చేసుకుంది. ఇలా మణికొండ ఆర్టీఏ అధికారులు నిర్వహించిన వేలంతో ఈ ఒక్కరోజే ఆర్టీఏకు రూ.52.6లక్షల ఆదాయం వచ్చింది.
ఫ్యాన్సీ నెంబర్స్..కొనుగోలు చేసిన వారు
TG 07 R 9999’-రూ.12,49,999 (కాంగ్రూయెంట్ డెవలపర్స్)
TG 07 AA 0009 రూ. 8.5లక్షలు (రుద్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్)
TG 07 AA 0001’రూ.4.77లక్షలు (ఫుజి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్)
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
