Hyderabad: నివాసాల మధ్య మందు తాగొద్దని వారించినందుకు.. నిండు ప్రాణాన్ని బలిగొన్నారు..
మందుతాగొద్దనడమే ఆ యువకులు చేసిన పాపం. అంతే చెలరేగిపోయారు మందుబాబులు. మమ్మల్నే అడ్డుకుంటారా అని ఆగ్రహంతో ఊగిపోయారు.
మందుతాగొద్దనడమే ఆ యువకులు చేసిన పాపం. అంతే చెలరేగిపోయారు మందుబాబులు. మమ్మల్నే అడ్డుకుంటారా అని ఆగ్రహంతో ఊగిపోయారు. నానా హంగామా సృష్టించారు. యువకులపై దాడిచేసి ఓ నిండు ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని కేకే గార్డెన్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో మద్యం తాగుతున్నారు మందుబాబులు. ఇక్కడ మద్యం తాగొద్దని స్థానిక యువకులు వారిని వారించారు. అంతే చెలరేగిపోయారు. మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వారిపై దాడికి దిగారు. కాసేపు వీరంగం సృష్టించారు. మందుబాబుల దాడిలో నర్సింహారెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. మరో నలుగురు యవకులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. యువకుడి మరణంతో మందుబాబులు అక్కడి నుంచి పరారయ్యారు.
తన తమ్ముడిని కొందరు దుండగులు విచక్షణారహితంగా కొట్టి చంపారంటున్నారు మృతుడి అన్న. గంజాయి మత్తులో వారేం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తించారని చెప్పారు. నర్సింహారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు.
Also Read: Telangana: కిలో మటన్ కొను.. అదిరిపోయే గిఫ్ట్ పట్టు.. వ్యాపారి క్రేజీ ఆఫర్..
సంచలనం.. ‘ప్లాస్టిక్ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే