AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Aug 23, 2026 | 2:49 PM

Share

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు, వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రోజు, 23 ఆగస్టు 2026, ఉదయం 08:30 గంటలకు (IST) వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఒక అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండి, ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. దీంతోపాటు సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఈరోజు అమృత్‌సర్, పాటియాలా, మొరాదాబాద్, లక్నో, దేహ్రీ, పురూలియా, వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడన కేంద్రం మీదుగా ప్రయాణించి, అక్కడినుండి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది.

తెలంగాణ వాతావరణ సూచనలు (FORECAST)

ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. సోమవారం, మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

హెచ్చరికలు (WARNINGS)

ఈరోజు ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర, ఈశాన్య తెలంగాణలో మిగిలిన ప్రాంతాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సోమవారం ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, గంటకు 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో సైతం వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ;-

ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-

ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
వాడు నా పొట్ట కొట్టాడు..
వాడు నా పొట్ట కొట్టాడు..
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మిచెల్ స్టార్క్ పేరు మీద మరో వరల్డ్ రికార్డు
మిచెల్ స్టార్క్ పేరు మీద మరో వరల్డ్ రికార్డు