Rain Alert: అటు వాయుగుండం.. ఇటు అల్పపీడనం! నేడు, రేపు దుమ్ములేపుడే.. ఆజిల్లాల్లో వడగండ్ల వాన
రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈనెల 27న పశ్చిమ మధ్య, సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్, మే 23: రాగల 2-3 రోజులలో కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన చక్రవాత ఆవర్తనం ప్రభావంతో, తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కోంకణ్ – గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈనెల 27న పశ్చిమ మధ్య, సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు తెలంగాణలోని అదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఈ రోజు (మే 23) తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, బయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే..
ఈ రోజు గరిష్టంగా నల్లగొండ లో 35.5, కనిష్టంగా మహబూబ్ నగర్ లో 30.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం (మే 22) నల్లగొండ, ఖమ్మం, రామగుండంలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- నల్లగొండ.. 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- ఖమ్మం.. 35.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- రామగుండం.. 35.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- భద్రాచలం.. 34.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- హైదరాబాద్.. 33.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- నిజామాబాద్.. 33.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- హనుమకొండ.. 32.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మెదక్.. 32.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మహబూబ్ నగర్.. 29.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు
ఏపీకి పొంచి ఉన్న వాయుగండం..
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి (రాబోయే 36 గంటల్లో) వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈనెల 27వ తేదీ నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తరువాత రెండు రోజుల్లో బలపడి తుఫానుగా మారే అవకాశం బలపడే అవకాశం ఉందని వాతావనఫ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 6 రోజుల్లో గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు శుక్రవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మే 24వ తేదీ అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు IMD అంచనా వేసింది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. నిన్న గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి పల్నాడు జిల్లా కాశిపాడు 29.5 మిమీ, విజయవాడ తూర్పులో 25.5 మిమీ, కర్నూలు జిల్లా దేవనబండలో 22.5 మిమీ, విజయనగరం జిల్లా విజయరాంపురంలో 18మిమీ, కాగంలో 17మిమీ వర్షపాతం నమోదైంది. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




