AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోటస్‌పాండ్‌లో అందరి చూపులు ఆ ఫ్లెక్సీల వైపే.. ఇంతకీ ఫ్లెక్సీలపై ఏం రాశారో తెలుసా..?

హైద‌రాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో ఏపీ సీఎం జగన్‌ సోదరి వైయస్‌ ష‌ర్మిల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి తెలంగాణ వ్యాప్తంగా..

లోటస్‌పాండ్‌లో అందరి చూపులు ఆ ఫ్లెక్సీల వైపే.. ఇంతకీ ఫ్లెక్సీలపై ఏం రాశారో తెలుసా..?
K Sammaiah
|

Updated on: Feb 09, 2021 | 5:38 PM

Share

హైద‌రాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో ఏపీ సీఎం జగన్‌ సోదరి వైయస్‌ ష‌ర్మిల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వైయస్‌ అభిమానులు భారీగా తరలొచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లపైనే అందరి చూపులు మళ్లాయి. ఫ్లెక్సీలపై ఆస‌క్తిక‌రంగా రాసిన నినాదాలు చర్చనీయాంశంగా మారాయి.

పార్టీ ఏర్పాటు కోసం షర్మిల సమావేశం ఏర్పాటు చేస్తున్నారనే సమాచారం నేపథ్యంలో ఒక రోజు ముందు నుంచే లోటస్‌పాండ్‌ వద్ద వైయస్‌ అభిమానులు, భారీగా ఫ్లెక్సీలు కట్టారు. ఆ ఫ్లెక్సీల్లో ఆసక్తికరంగా నినాదాలు రాసి వైయస్‌ కుటుంబం పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.

”మన కష్టం తెలుసని, మన కన్నీళ్లు తెలుసని, మన బ‌తుకులు మార్చే బాట” అని అందులో పేర్కొన్నారు. ”ఆ బాట ఏంటో వైఎస్సార్ కుటుంబానికి తెలుసని, షర్మిలమ్మ నాయకత్వం వర్దిల్లాలని” ఫ్లెక్సీల్లో ఉంది. అయితే, ఈ ఫ్లెక్సీలల్లో వైఎస్సార్, షర్మిల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఏ ఒక్క ఫ్లెక్సీ బ్యానర్‌లో ఏపీ సీఎం జ‌గ‌న్ ఫొటో లేకపోవడం గమనార్హం. జనంలోకి షర్మిలక్క వ‌స్తున్నార‌ని, జనరంజకపాలన ముందుందిక అంటూ ప‌లు ఫ్లెక్సీలు ఏర్పాటు కావ‌డం ఆసక్తిక‌రంగా మారింది.

Read more:

ఆ విషయంలో తన దారి తనదే.. నాదారి నాదే.. పార్టీ ఏర్పాటుపై ఎవరితోనూ సంప్రదించలేదన్న వైయస్‌ షర్మిల

ఆ ఉయ్యాలను చూసి ఆశ్చర్యపోయిన మంత్రి కేటీఆర్‌.. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి అందించిన ‘టీ వర్క్స్‌’ టీం

Follow Us
పూజలో వెలిగించే అగరబత్తితో ఇంత ప్రమాదమా?
పూజలో వెలిగించే అగరబత్తితో ఇంత ప్రమాదమా?
జీవిత సత్యాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పిన ఇసుక కోట కథ..!
జీవిత సత్యాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పిన ఇసుక కోట కథ..!
కలలో పోగొట్టుకున్న డబ్బు తిరిగి దొరికిందా? ఈ శుభసూచన మీకేనట!
కలలో పోగొట్టుకున్న డబ్బు తిరిగి దొరికిందా? ఈ శుభసూచన మీకేనట!
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రైస్.. ఇది పెడితే బాక్స్ ఖాళీనే
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రైస్.. ఇది పెడితే బాక్స్ ఖాళీనే
షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్
షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్
ఫ్రిజ్‌లో ఎన్ని వాటర్ బాటిళ్లు పెట్టాలి? ఎక్కువ పెడితే ఏమవుతుంది?
ఫ్రిజ్‌లో ఎన్ని వాటర్ బాటిళ్లు పెట్టాలి? ఎక్కువ పెడితే ఏమవుతుంది?
MBBS, BDS విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. స్టైపండ్ పెంపు
MBBS, BDS విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. స్టైపండ్ పెంపు
బాల్యం మొదలయ్యేలోపే జీవితానికి ముగింపు..!
బాల్యం మొదలయ్యేలోపే జీవితానికి ముగింపు..!
గుండెపోటు అంటే ఛాతీ నొప్పే కాదు.. ఈ సంకేతాలను గుర్తించండి!
గుండెపోటు అంటే ఛాతీ నొప్పే కాదు.. ఈ సంకేతాలను గుర్తించండి!
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!