ఆ ఉయ్యాలను చూసి ఆశ్చర్యపోయిన మంత్రి కేటీఆర్.. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి అందించిన ‘టీ వర్క్స్’ టీం
ఉయ్యాలలో ఊగే పసిసిల్లల కోసం ఓ అధునాత ఉయ్యాలను తయారు చేశారు టీ వర్క్స్ బృందం. రోటీన్ ఉయ్యాలలకు బిన్నంగా చిన్నారుల కోసం..
ఉయ్యాలలో ఊగే పసిసిల్లల కోసం ఓ అధునాత ఉయ్యాలను తయారు చేశారు టీ వర్క్స్ బృందం. రోటీన్ ఉయ్యాలలకు బిన్నంగా చిన్నారుల కోసం అధునాతన ఉయ్యాలను తయారుచేసి సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి అందించిన టీ వర్క్స్ బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆస్పత్రుల్లో చిన్న పిల్లల విభాగం కోసం నూతనంగా రూపొందించిన ఊయలలను ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశంసించారు.
అధునాతనంగా ఎలాంటి నట్లు, బోల్టుల వియోగం లేకుండా, సులభంగా ఉపయోగించేలా ఉయ్యాలను తయారు చేయడం హర్షణీయమన్నారు. పసిపిల్లలకు బెడ్ మాదిరిగా ఉయ్యాలలను రూపొందించడం సహా వాటిని ఒక స్థానం నుంచి మరో స్థానానికి సులువుగా తీసుకెళ్లేందుకు అనువుగా ఉయ్యాలను రూపొందించారు.
ఎలాంటి నట్లు, బోల్టులు లేకుండానే ఉయ్యాలను బిగించడం.. మళ్లీ విప్పి సంచిలో పెట్టుకుని తీసుకెళ్లే విధంగా ఉయ్యాలను రూపొందించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అధునాతన ఉయ్యాలను రూపొందించిన టీ వర్క్స్ బృందాన్ని అభినందించారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలు మరిన్ని చేసి సక్సెస్ సాధించాలని ఆకాంక్షించారు.
Great job team @TWorksHyd ? https://t.co/AvRr1kv6Qq
— KTR (@KTRTRS) February 8, 2021
Read more: