Hyderabad Metro: లాక్‏డౌన్ సడలింపు.. రేపట్నుంచి హైదరాబాద్‏లో మెట్రో పరుగులు.. మారిన టైమింగ్స్ ఇవే..

|

Jun 09, 2021 | 2:10 PM

Hyderabad Metro Timings: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కఠినంగా లాక్‏డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే.

Hyderabad Metro:  లాక్‏డౌన్ సడలింపు.. రేపట్నుంచి హైదరాబాద్‏లో మెట్రో పరుగులు.. మారిన టైమింగ్స్ ఇవే..
Metro
Follow us on

Hyderabad Metro Timings: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కఠినంగా లాక్‏డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో గత వారం రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న (జూన్ 8న) లాక్ డౌన్ విషయంపై కేబినెట్ సమావేశం నిర్వహించిన ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 10 నుంచి 20 వరకు లాక్ డౌన్ మరో పది రోజులు అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కేసుల తగ్గుతుండడంతో సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఇచ్చింది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లాక్‌డౌన్‌ అమలవుతుంది. ఇందులో భాగంగానే ప్రజా రవాణ అయిన ఆర్టీసీ బస్సులు, రైళ్లు, మెట్రో వంటి వాటికి సడలింపులు ఇచ్చింది. Lock Down

ఇక ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ సడలింపు విషయంతో మెట్రో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఈ మేరకు రేపట్నుంచి (జూన్ 10) ఉదయం 7 గంటలకు ప్రారంభయ్యే రైళ్లు ఇక నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా తిరగనున్నాయి. దీంతో చివరి రైలు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి చివరి స్టేషన్‏కు 6 గంటల వరకే చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు మెట్రో అధికారులు. ఇక మారిన మెట్రో సమయాలను ఈరోజు అధికారికంగా ప్రకటించనున్నారు. lock down relaxation

Also Read: Etela Rajendar Fires: స్వరం పెంచిన ఈట‌ల‌.. అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేరుః రాజేందర్

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హ‌త్య కేసులో మూడో రోజు సీబీఐ విచార‌ణ.. కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌తోపాటు మరొకరిని ప్రశ్నిస్తున్న అధికారులు

Health Tips: కరోనాను నయం చేయడానికి గ్రీన్ టీ సహయపడుతుందా ? అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..

AP Progress Report: అన్ని రంగాల్లోనూ ప్రగతిపథంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్..ప్రభుత్వ రెండేళ్ళ ప్రోగ్రస్ రిపోర్ట్!