ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం..కార్మికులకు హామీ

ఆర్టీసీ సమ్మెపై స్పందించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశానని..ఈ అంశంపై తెలంగాణ సీఎంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారన్నారు. త్వరలోనే తెలంగాణ రవాణా మంత్రి, అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకునేందుకు కేంద్రానికి పూర్తి అధికారముందన్నారు కిషన్‌రెడ్డి. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు వదిలేసి..వారిని ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వారి […]

ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం..కార్మికులకు హామీ
Follow us

|

Updated on: Nov 21, 2019 | 9:01 PM

ఆర్టీసీ సమ్మెపై స్పందించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశానని..ఈ అంశంపై తెలంగాణ సీఎంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారన్నారు. త్వరలోనే తెలంగాణ రవాణా మంత్రి, అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకునేందుకు కేంద్రానికి పూర్తి అధికారముందన్నారు కిషన్‌రెడ్డి. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు వదిలేసి..వారిని ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

వారి కనీస డిమాండ్లు నెరవేర్చాలన్నారు.దాదాపు 45 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఇటు తెలంగాణ సర్కార్‌..అటు ఆర్టీసీహైకోర్టులో తమ వాదనలు వినిపించాయి. ఐతే ప్రభుత్వానికి తామెలాంటి ఆదేశాలివ్వలేమన్న హైకోర్ట్‌..15 రోజుల్లోగా సమస్య పరిష్కరించాలని లేబర్‌ కోర్టును ఆదేశించింది. మరోవైపు బేషరతుగా తమను ఆహ్వానిస్తే విధులకు హాజరవుతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ సమ్మెపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు.

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ బీజేపీ ఎంపీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ అంశంలో కేంద్రాన్ని ఇన్వాల్వ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 45 రోజుల తర్వాత సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ..కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌, సోయం బాపూరావు కేంద్ర రవాణా మంత్రి గడ్కరీని కలిశారు. ఎంపీల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ..త్వరలోనే సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని..రాష్ట్ర రవాణా శాఖామంత్రి, అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి..ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకునేందుకు కేంద్రానికి పూర్తి అధికారముందన్నారు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మాని..వారి కనీస డిమాండ్లు నెరవేర్చాలన్నారు. ఇక ఆర్టీసీ సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందన్నారు నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ . ముఖ్యమంత్రితో చర్చించేందుకు మంత్రి గడ్కరీ ప్రయత్నించినప్పటికీ కేసీఆర్‌ అందుబాటులో లేరన్నారు. ఇక కార్మికులు ఆత్మహత్యలు చేసుకోనవసరం లేదన్నారు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఇక బంగారు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులూ భాగస్వాములే. సమ్మెకాలానికి జీతాలు చెల్లించి వారిని బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు.

Latest Articles
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే