AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ప్లైఓవర్ పనుల కారణంగా ఈ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. ఎలా వెళ్లాలంటే?

నగరంలోని వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్ల వద్ద స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌ పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్టు ప్రకటించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ట్రాఫిక్ డైవర్షన్‌కు సహకరించాలని కోరారు. పూర్తి వివరాలు కోసం ఈ స్టోరీ చదవండి.

వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ప్లైఓవర్ పనుల కారణంగా ఈ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. ఎలా వెళ్లాలంటే?
Hyderabad Traffic Diversions Jubilee Hills Kbr Park
Anand T
|

Updated on: Jun 08, 2026 | 2:57 PM

Share

నగరంలోని వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కెబిఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధా జంక్షన్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్టు తెలిపారు. ముగ్ధా జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ (గేట్-1), జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, రోడ్డు నెం.2, బంజారాహిల్స్‌కు వెళ్లకుండా ఈ క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

పోలీసులు తెలిపిన ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే

NFCL నుండి జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వారు: NFCL నుండి ఎస్.ఎన్.టి (SNT), సాగర్ సొసైటీ (ముగ్ధ), కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నంబర్ 36, రోడ్ నంబర్ 45 ,కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను SNT జంక్షన్, సాగర్ సొసైటీ వద్ద మళ్లిస్తారు. వీరు శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, రోడ్ నంబర్ 5 (జూబ్లీహిల్స్), వెంకటగిరి ఎక్స్ రోడ్స్ (రోడ్ నంబర్ 10, జూబ్లీహిల్స్) మీదుగా వెళ్లి, అక్కడ లెఫ్ట్‌ తీసుకొని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు చేరుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

KCP, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 నుండి వెళ్లే వారు: ఇక్కడి నుండి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నంబర్ 36 వైపు వెళ్లే ట్రాఫిక్‌ను తాజ్ కృష్ణా వద్ద బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10, సిటీ సెంటర్ రోడ్ నంబర్ 1/10 వైపు మళ్లిస్తారు. అక్కడ రైట్ తీసుకొని జహీరానగర్, క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా వెళ్లి, అక్కడ మళ్లీ లెఫ్ట్‌ తీసుకుని అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్‌కు చేరుకోవాలి.

మాసాబ్ ట్యాంక్ నుండి వెళ్లే వారు: ఇక మాసాబ్ ట్యాంక్ నుండి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1, 12 జంక్షన్ వద్ద మళ్లిస్తారు. వీరు అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్ వైపు వెళ్లవచ్చు.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36- 45 నుండి NFCL వైపు వెళ్లే వారు: ఈ మార్గంలో NFCL వైపు వెళ్లే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి రోడ్ నంబర్ 2 , యూసుఫ్‌గూడ బస్తీ, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, వాల్యూ జోన్, పంజాగుట్ట మెయిన్ రోడ్ వైపు మళ్లిస్తారు.

బేగంపేట నుండి NFCL వైపు వెళ్లే వారు: బేగంపేట నుండి వచ్చేవారిని NFCL వద్ద బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1, 4, 1, 7, తాజ్ కృష్ణా, సిటీ సెంటర్, రోడ్ నంబర్ 1/10 బంజారాహిల్స్ వైపు మళ్లిస్తారు. అక్కడ రైట్ తీసుకొని జహీరానగర్, క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ హాస్పిటల్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, చెక్‌పోస్ట్‌కు చేరుకోవచ్చు.

అయితే ఈ రూట్‌లో వెళ్లే ప్రయాణికులు పంజాగుట్ట ఫ్లైఓవర్‌పైకి వెళ్లకుండా, కాకతీయ హోటల్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు గుండా పంజాగుట్ట ఎక్స్ రోడ్స్, NFCL, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వైపు వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు. ఉదయం 8:30 గంటల నుండి 11:00 గంటల వరకు, అలాగే సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు ఈ మార్గాలలో ప్రయాణాలను వీలైనంత వరకు నివారించాలని లేదా ముందే ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us