కేసీఆర్ చొరవతో.. ప్రాజెక్టు కలకల..!
ఉమ్మడి పాలమూరు జిల్లా జూరాల ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కర్ణాటక ప్రభుత్వం 2.5 టీఎంసీల నీరు విడుదలకు అంగీకరించింది. దీంతో.. ప్రాజెక్టుకు కృష్ణ జలాలు క్రమక్రమంగా చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక అధికారులు ఆల్మట్టి డ్యామ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌లో 30.38 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 7836 క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ డ్యామ్‌కు విడుదల చేశారు. ఆల్మట్టి డ్యామ్ నుంచి కొత్తగా నీరు చేరడంతో ప్రస్తుతం […]
ఉమ్మడి పాలమూరు జిల్లా జూరాల ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కర్ణాటక ప్రభుత్వం 2.5 టీఎంసీల నీరు విడుదలకు అంగీకరించింది. దీంతో.. ప్రాజెక్టుకు కృష్ణ జలాలు క్రమక్రమంగా చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక అధికారులు ఆల్మట్టి డ్యామ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌లో 30.38 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 7836 క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ డ్యామ్‌కు విడుదల చేశారు. ఆల్మట్టి డ్యామ్ నుంచి కొత్తగా నీరు చేరడంతో ప్రస్తుతం నారాయణపూర్ డ్యామ్‌లో 18.08 టీఎంసీల నిల్వకు చేరింది.