AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. కాంగ్రెస్ నేతల ఇళ్లపై అధికారుల దాడులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. గురువారం ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 10 ప్రాంతాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డికి చెందిన బాలాపూర్ లోని నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. బడంగ్పేట్ మేయర్ గా ఉన్న పారిజాత కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ఆశించారు.

IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. కాంగ్రెస్ నేతల ఇళ్లపై అధికారుల దాడులు
Mayor Parijatha Narasimha Reddy
Sanjay Kasula
|

Updated on: Nov 02, 2023 | 10:38 AM

Share

హైదరాబాద్, నవంబర్ 02: రేపే నోటిఫికేషన్.. ప్రచారం కోసం అగ్రనేతలంతా గ్రౌండ్‌లోకి దిగారు. ప్రత్యర్థులపై బాణాలు సంధిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వారు రక రకాలుగా ప్రయాత్నాలు చేసుకుంటున్న ఈ తరుణంలో  ఐటీ దాడులు సంచలనంగా మారాయి. ముగ్గురు నేతలు టార్గెట్‌గా ఐటీ శాఖ అధికారుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు.

గురువారం ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. సుమారు 10 ప్రాంతాల్లో ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. బడంగ్‌పేట మేయర్‌ పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. మహేశ్వరం టికెట్ కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారు పారిజాత నరసింహారెడ్డి. టికెట్ వ్యవహారంలో భారీగా డబ్బులు సమకూర్చుకున్నట్లు ఐటీ శాఖకు సమాచారం అందడంతో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా శంషాబాద్ సమీపంలోని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం అభ్యర్థి కేఎల్ఆర్ నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5గంటల నుంచి ఏకకాలంలో అధికారులు ఈ దాడులు జరుగుతున్నాయి. ఐటీ రైడ్స్ సమయంలో ఇంట్లో లేరు మేయర్ పారిజాత. ప్రస్తుతం భర్త ఢిల్లీలో, భార్య తిరుపతిలో ఉన్నారు. పారిజాత కూతురు ఫోన్ స్వాధీనం చేసుకొని సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.

పారిజాత నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు నివాసాల్లో పదిహేను బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. బాలాపూర్ లో లడ్డు వేలంలో దక్కించుకున్న వంగటే లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. వీరితో పాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నారు. పెద్ద మొత్తంలో అనధికారికంగా డబ్బు, నగలు ఉన్నట్లు సమాచారం రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి