Robbery in Hyderabad: దొంగతనానికి వచ్చాడు.. చిన్న ఏమరపాటుతో ప్రాణాలే కోల్పోయాడు..
Robbery in Hyderabad: పాపం దొంగ.. చోరీ కోసం వచ్చి ప్రాణాలే కోల్పోయాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని వెంకటగిరిలో చోటు చేసుకుంది.
Robbery in Hyderabad: పాపం దొంగ.. చోరీ కోసం వచ్చి ప్రాణాలే కోల్పోయాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని వెంకటగిరిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివరాల్లోకెళితే.. బోరబండ సఫ్దర్‌నగర్‌కు చెందిన సయ్యద్ చాంద్ పాషా అలియాస్ ఇబ్రహీం(22) ఓ గ్యాంగ్‌తో కలిసి దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. బ్యాచ్‌లర్ గదులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే పాషా.. వెంకగిరిలో ఓ బ్యాచిలర్ రూమ్ టార్గెట్‌గా దొంగతనానికి వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో పాషా, మరో వ్యక్తి ఇద్దరూ కలిసి బైక్‌పై వెంకటగిరికి వెళ్లారు. తనతో వ్యక్తిని కిందనే ఉండమని చెప్పిన పాషా.. ఆ తరువాత తాను ఒక్కడే ఐదు అంతస్తుల బిల్డింగ్ లోపలికి ప్రవేశించాడు. ఐదో అంతస్తులో ఉన్న బ్యాచిలర్ గది లక్ష్యంగా ముందుకు కదిలాడు. అయితే, అప్పటికీ కొందరు యువకులు మెలకువతో ఉన్నారు.
పాషాను గమనించడంతో.. అతను భయపడిపోయాడు. దాంతో పాషా పారిపోయే ప్రయత్నంలో భాగంగా పక్కనే ఉన్న స్కూలు భవనంలోకి దూకాడు. అక్కడి నుంచి మరో బిల్డింగ్‌పైకి దూకేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో పాషా పట్టుతప్పి కిందపడిపోయాడు. నాలుగు అంతస్తుల భవనంపై నుంచి కింద పడటంతో.. పాషాకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన పాషాపు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ పాషా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తాజా ఘటనతో వెంకటగిరి ప్రజలు కంగారుపడ్డారు. వెంకటగిరి పరిధిలో చోరీలు ఎక్కువయ్యాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also read:
20 బంతుల్లో 50 పరుగులు..! ఒకే ఫోర్.. మిగతావి మొత్తం సిక్స్‌లే.. ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడు..