West Bengal election 2021: బెంగాల్‌లో ఉద్రిక్తంగానే పరిస్థితులు.. మళ్లీ పెద్ద ఎత్తున బాంబుల స్వాధీనం..

Crude Bombs: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగిశాయి. ఇంకా

West Bengal election 2021: బెంగాల్‌లో ఉద్రిక్తంగానే పరిస్థితులు.. మళ్లీ పెద్ద ఎత్తున బాంబుల స్వాధీనం..
Bombs Recovered In Murshidabad
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 13, 2021 | 9:07 AM

Crude Bombs: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగిశాయి. ఇంకా నాలుగు విడతల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో విపక్ష పార్టీల మధ్య నిత్యం ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి సంఘటన చోటుచేసుకుంటుందోనని అంతటా ఆందోళన నెలకొంది. ఇటీవలనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి పెద్ద ఎత్తున బాంబులు పట్టుబడటం కలకలం రేపుతోంది. సోమవారం ముర్షిదాబాద్‌ జిల్లాలోని షంషేర్‌గంజ్‌‌ ప్రాంతంలో సోమవారం 14 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 17న రాష్ట్రంలో ఐదో దశ పోలింగ్‌ జరగనుంది. దీనికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన నాటినుంచి రాష్ట్రంలోని పలుచోట్ల పెద్ద ఎత్తున బాంబులను, తయారీ పరికరాలను, గన్‌ పౌడర్‌, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగో విడత ఎన్నికల్లో కూడా ఓ కమ్యూనిటీ హాల్లో 200 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకొని నిర్వీర్యం చేశారు. అయితే ఎన్నికల సమయంలో పెద్దఎత్తున బాంబులు బయటపడుతుండడంతో రాష్ట్రమంతటా ఆందోళన నెలకొంది.

ఈ నెల 10న నాలుగో విడత ఎన్నికల్లో కూచ్‌ బెహార్‌ జిల్లాలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు టీఎంసీ కార్యకర్తలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అనంతరం ఇంటిలిజెన్స్ నివేదిక ప్రకారం.. 126 పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో వాయిదా వేయాలని, దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. ఈ ఘటన తర్వాత కూచ్ బెహార్ జిల్లాలోకి ఎవరూ ప్రవేశించకుండా 72 గంటల పాటు నిషేధం విధించింది. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

Also Read:

Gun Misfire: తుపాకీ మిస్‌ఫైర్‌ ఘటనలో కొత్త కోణం.. క్షణికాశంలో హోంగార్డే భార్యపై కాల్పులు

Road Accident: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. ఏడుగురు మృతి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..