Hyderabad: ‘ఇకపై టీవీ చూడనులే నాన్న’ — యువతి ఆఖరి లేఖ
ఆ యువతికి అనారోగ్యం. కానీ పేద కుటుంబం కావడంతో ఇంట్లో చెప్పులేక మదనపడేది. అనారోగ్య కారణాలతో డిగ్రీ పూర్తి చేసినప్పటికీ జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉండేది. దీంతో పదే, పదే ఫోన్ చూస్తుందని యువతిని తండ్రి మందలించాడు. దీంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
ఆ యువతికి అనారోగ్యం. కానీ పేద కుటుంబం కావడంతో ఇంట్లో చెప్పులేక మదనపడేది. అనారోగ్య కారణాలతో డిగ్రీ పూర్తి చేసినప్పటికీ జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉండేది. దీంతో పదే, పదే ఫోన్ చూస్తుందని యువతిని తండ్రి మందలించాడు. దీంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా, రావల్‌వెల్లి మండలం కేశంపేటకు చెందిన స్వామిగౌడ్, సరిత దంపతులు.. కొన్ని ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. పాపిరెడ్డినగర్‌లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె దివ్య(21), కుమారుడు రవికుమార్ ఉన్నారు.
స్వామిగౌడ్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. రవికుమార్ ఓ ప్రవేట్ జాబ్ చేస్తున్నాడు. దివ్య గ్రాడ్యువేషన్ కంప్లీట్ చేసి ఓ ప్రైవేటు ఉద్యోగం చేసింది. ఆ జాబ్ మానేసి ప్రస్తుతం ఇంట్లోనే ఖాళీగా ఉంది. జాబ్ చూసుకోకుండా ఇంట్లో టీవీ, ఫోన్ చూస్తూ కాలం గడుపుతుండటంతో తండ్రి తిట్టాడు. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. ‘నాన్నా.. నేను చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇక నేను టీవీ చూడను, ఫోన్ చూడను… ఇకపై మీకు ఎటువంటి సమస్య ఉండదు’ అని దివ్య రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..