AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మంచి నీళ్లు అనుకుంటున్నారా.. కాలకూట విషం.. ఆ నీరు తాగితే ఇక అంతేనా..

మాదాపూర్‌, హైటెక్ సిటీ, కొండాపూర్‌, బోరబండకి సరఫరా అయ్యే వాటర్‌ కొబ్బరినీళ్లని కాన్ఫిడెంట్‌గా చెప్పుకుంటున్నారా..? అక్కడే ఉంటూ బిందెలకొద్దీ బోరు వాటర్‌ లాగిస్తున్నారా? అయితే.. మీరు తాగుతున్నది వాటర్‌ కాదండోయ్. పక్కా విషం.. కాలకూట విషం. నమ్మట్లేదా..? ఆధారాలతో సహా చూపిస్తా. మీరు ఇప్పటివరకూ డెడ్‌ సీలనే చూసుంటారు..! కానీ మీకిప్పుడు డెడ్‌ లేక్‌ గురించి షాకింగ్ విషయాలు చెప్పబోతున్నాం..

Hyderabad: మంచి నీళ్లు అనుకుంటున్నారా.. కాలకూట విషం.. ఆ నీరు తాగితే ఇక అంతేనా..
Madhapur Sunnam Cheruvu
Shaik Madar Saheb
|

Updated on: Jun 28, 2025 | 9:57 AM

Share

మీరు మాదాపూర్‌లో నివాసముంటున్నారా…? హైటెక్‌ సిటీలోని ఆఫీస్‌లో కూర్చుని హైజెనిక్‌ వాటర్‌ తాగుతున్నామనుకుంటున్నారా..? కొండాపూర్‌కి సరఫరా అయ్యే వాటర్‌ కొబ్బరినీళ్లని కాన్ఫిడెంట్‌గా చెప్పుకుంటున్నారా..? బోరబండంలో ఉంటూ బిందెలకొద్దీ బోరు వాటర్‌ లాగిస్తున్నారా? అయితే మీరు నీళ్లల్లో కాదు ఏకంగా వాటర్‌ ట్యాంకర్‌లో కాలేసినట్లే…! మీరు తాగుతున్నది వాటర్‌ కాదండోయ్. పక్కా విషం…కాలకూట విషం. నమ్మట్లేదా…? ఆధారాలతో సహా చూపిస్తా. మీరు ఇప్పటివరకూ డెడ్‌ సీలనే చూసుంటారు.! కానీ మీకిప్పుడు డెడ్‌ లేక్‌ గురించి షాకింగ్ విషయాలు చెప్పబోతున్నాం.. అవేంటో తెలుసుకోండి..

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లోని ఈ సున్నంచెరువే ఇప్పుడు ప్రజల ప్రాణాలకు కన్నం వేస్తోంది. మహానగరంలోని 6 చెరువుల పునరుజ్జీవనం కోసం కృషి చేస్తున్న హైడ్రా.. మొదటిదశలో భాగంగా మాదాపూర్‌లోని సున్నం చెరువుపై దృష్టి సారించగా.. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రాంతంలోని భూగర్భజలాలు అత్యంత ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు హైడ్రా షాకింగ్ విషయాలు వెల్లడించింది. సున్నం చెరువులో భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో అనే అంశాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా హైడ్రా పరీక్షించింది. దీంతో ఈ వాటర్‌లో సీసం, కాడ్మియం, నికెల్ లోహాల మోతాదులు ఓ రేంజ్‌లో ఉన్నట్లు తేటతెల్లమైంది. సున్నంచెరువు నీళ్లు మామూలు విషం కాదు.. కాలకూట విషమని తేల్చారు అధికారులు.

ఈ నీళ్లలో 12 రెట్లు అధికంగా సీసం ఉన్నట్లు తేల్చారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక లీటరు నీటిలో 0.01 మిల్లీగ్రాముల సీసం వరకూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో 0.073 నుంచి 0.122 ఉన్నట్టు పీసీబీ గుర్తించింది. దీని ప్రభావం పిల్లల మెదడు చురుకుతనంపై పడుతుంది. జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. రక్తహీనతకు కారణమవవ్వడమే కాదు.. బాల్యం, యవ్వన దశలోనే కిడ్నీలపై ఎఫెక్ట్‌ అవుతుందంటున్నారు డాక్టర్లు.

కాడ్మియం కూడా మోతాదుకి మించి ఉంది. కాడ్మియం 0.003 వరకూ అయితే ఫర్వాలేదు. కానీ ఇక్కడి బోరు వాటర్లో 0.007 నుంచి 0.010 ఉన్నట్టు వెల్లడైంది. అంటే 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉంది. దీని ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. క్యాన్సర్ వ్యాధికి కూడా కారణమౌతుంది. ఇటు నికెల్‌ కూడా 2రెట్లు అధికంగా ఉన్నట్లు తేల్చారు అధికారులు. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులతో పాటు.. కాలేయం దెబ్బతింటుంది. తద్వారా మూత్రపిండాల మీద ఎఫెక్ట్స్‌ పడుతుంది.

మరీ నీళ్లను మరగబెట్టైనా తాగొచ్చా అనంటే..! నో యూజ్‌ అంటున్నారు వైద్యులు. నాలుగైదు సార్లు మారగబెట్టినా ఫలితం ఉండకపోగా… ప్రాణాలకు మరింత హానీ అంటున్నారు. ఇందులో సూక్ష్మక్రిములు నశించినా.. సీసం, కాడ్మియం, నికెల్ వంటి లోహాలు కరగకపోవడంతో ప్రాణాలకే ముప్పని హెచ్చరిస్తున్నారు.

సో.. సున్నంచెరువు వెరీ డేంజర్‌ అన్నది తేటతేల్లమైంది. బొట్టుబొట్టులోనూ దాగున్న విషం మట్టుబెట్టడం ఖాయమని విషయం తేలిపోయింది. కాబట్టి మనం ఏ నీళ్లు తాగుతున్నాం..! ఎక్కడి నీళ్లు వాడుతున్నాం అనే విషయంలో వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాల్సిందే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..