Hyderabad: గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. గోడకూలి ఒకరు మృతి, నలుగురికి గాయాలు!
హైదరాబాద్ గత సాయంత్రం నుంచి ఎడతెలిరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గచ్చిబౌలిలోని వట్టినాగుల పల్లిలో గోడ కూలి ఒకరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వారిని వెంటనే స్థానిక హాస్పిలల్‌కు తరలించారు.

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. నగరంలో గత సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో గచ్చిబౌలిలోని వట్టినాగుల పల్లిలో గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు కార్మికులు మృతి చెందగా, మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారికి వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు నగరంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయంగా మారాయి, పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు రోడ్లపై నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




