పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు దేశ ప్రజలు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31న పెద్ద ఎత్తున పార్టీలు, సంబరాలు జరుపుకొంటున్నారు. దేశ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 5 గంటల నుంచి ఫ్లెఓవర్లు మూసివేశారు. 60 బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితో రూ.10 వేల జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. అలాగే 6 నెలల జైలు శిక్ష తప్పదని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హుకూం జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 52 ప్రాంతాలలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగింది. దీంతో మందుబాబులు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. ఇలా పట్టుబడుతుండటంలో మందుబాబులు పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. పోలీసులు వారిని ఎంత సముదాయించినా ఏ మాత్రం వినకుండా వాగ్వివాదానికి దిగుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
అయితే కొంత మంది మందుబాబులు వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో పోలీసులపైనే ఎదురు తిరిగారు. ఒక్కసారిగా గొడవలు చెలరేగాయి. దీంతో పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం వినకపోవడంతో లాఠీఛార్జ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి