రూల్స్ పాటిస్తే.. సినిమా చూపిస్తాం: ట్రాఫిక్ పోలీసులు

మీరు ట్రాఫిక్ నియమాలు సరిగ్గా పాటిస్తున్నారా..? అయితే.. ట్రాఫిక్ పోలీసుల సర్‌ప్రైజ్ గిఫ్ట్ గ్యారెంటీ మాట..! ఏంటీ ఆశ్చర్యపోతున్నారా..! నిజమే.. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించే వారిని వెతికి మరీ వారికి.. ట్రాఫిక్ పోలీసులు సినిమా టికెట్లు ఇస్తున్నారంట. ఇప్పటికే.. ఎన్ని ట్రాఫిక్ నియమాలు వచ్చినా.. వాహనదారులు ఖాతరు చేయడంలేదు. దీంతో.. నియమాలను పాటించాలని తాజాగా.. భరత్ అనే సినిమాను ఫాలో అయ్యి.. చలాన్లు.. ఒక రేంజ్‌లో పెంచేశారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో.. చాలా వరకూ వాహనదారుల్లో […]

రూల్స్ పాటిస్తే.. సినిమా చూపిస్తాం: ట్రాఫిక్ పోలీసులు
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2019 | 8:32 AM

మీరు ట్రాఫిక్ నియమాలు సరిగ్గా పాటిస్తున్నారా..? అయితే.. ట్రాఫిక్ పోలీసుల సర్‌ప్రైజ్ గిఫ్ట్ గ్యారెంటీ మాట..! ఏంటీ ఆశ్చర్యపోతున్నారా..! నిజమే.. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించే వారిని వెతికి మరీ వారికి.. ట్రాఫిక్ పోలీసులు సినిమా టికెట్లు ఇస్తున్నారంట.

ఇప్పటికే.. ఎన్ని ట్రాఫిక్ నియమాలు వచ్చినా.. వాహనదారులు ఖాతరు చేయడంలేదు. దీంతో.. నియమాలను పాటించాలని తాజాగా.. భరత్ అనే సినిమాను ఫాలో అయ్యి.. చలాన్లు.. ఒక రేంజ్‌లో పెంచేశారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో.. చాలా వరకూ వాహనదారుల్లో మార్పు వచ్చింది. హెల్మెట్‌ పెట్టుకుంటూ.. రూల్స్‌ని ఫాలో అవుతున్నారు. దీంతో.. మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారిని మరింత ప్రోత్సహించడానికి ఈ కొత్త ఐడియాతో ముందుకొచ్చారు.

ట్రాఫిక్ నియమాలను తూ.. చ.. తప్పకుండా పాటించేవారికి సినిమా టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో.. నియమాలను పాటించే వాహనదారులను గుర్తించి వారికి సినిమా టికెట్లను అందజేశారు.

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆదేశాలమేరకు.. ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. వాహనదారుల్లో మార్పు కోసమే ఇలాంటి కొత్త నిర్ణయం తీసుకున్నామని.. దీంతో.. వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించని వారికి కూడా.. ఇక ఫాలో అవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే.. ఇప్పుడు హెల్మెట్ వాడే వారి శాతం కూడా పెరిగిందన్నారు అనిల్ కుమార్.

ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్